YSRCP: ఆ ఇద్దరికీ ఝలక్ ఇచ్చిన సీఎం జగన్..
ABN, Publish Date - Feb 17 , 2024 | 07:01 AM
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏడో జాబితాను అధిష్టానం రాత్రి పొద్దుపోయిన తర్వాత విడుదల చేసింది. ఈ ఏడవ జాబితాలో ఇద్దరికి మొండిచేయి చూపించింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర రెడ్డికు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏడో జాబితాను అధిష్టానం రాత్రి పొద్దుపోయిన తర్వాత విడుదల చేసింది. ఈ ఏడవ జాబితాలో ఇద్దరికి మొండిచేయి చూపించింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర రెడ్డికు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్‌ను సీఎం జగన్ రంగంలోకి దించారు. పర్చూరు నియోజకవర్గంలో ఇంఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌కు కూడా హ్యాండ్ ఇచ్చారు. పర్చూరుకు యడం బాలాజీను సమన్వయకర్తగావైసీపీ అధిష్టానం నియమించింది. ఎప్పుడు హడావుడిగా ప్రకటించే జాబితాను ఈ సారి ఇద్దరి పేర్లతో విడుదల చేసింది.
ఈ రెండు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు ఆసక్తికరంగా మారాయి. పర్చూరు ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను తప్పించడం ఆసక్తికరంగా మారింది. ఆమంచికి ఏ సీటు ఇస్తారన్నది తెలియరాలేదు. కృష్ణమోహన్ పర్చూరులో పోటీచేయడానికి ఆసక్తిగా లేరు.. తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో పర్చూరు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.
Updated Date - Feb 17 , 2024 | 10:14 AM