నేలపైనే గర్భిణులు
ABN, Publish Date - Dec 04 , 2024 | 11:31 PM
మాతా శిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తున్నా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.
గంటల తరబడి స్కానింగ్ కోసం నిరీక్షణ
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మాతా శిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తున్నా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. సాక్షాత్తు జిల్లా కేంద్రమైన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అల్ర్టాసౌండ్ స్కానింగ్, టెఫా స్కాన కోసం గంటల తరబడి నేలపైనే గర్భిణులు కూర్చుంటున్నారు. కనీసం న్యూడయోగ్నస్టిక్ సెంటర్‌లో సాధారణ రోగులు, వారి సహాయకులకు మాత్రం కుర్చీల్లో కూర్చుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణులు కూర్చునే ఓపిక లేక అవస్థలు పడ్డారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుర్చ్చీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
Updated Date - Dec 04 , 2024 | 11:31 PM