ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ఎన్నికల ముందు పవన్ మరో కీలక నిర్ణయం!

ABN, Publish Date - Mar 21 , 2024 | 02:40 AM

ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘వారాహి’ వాహనాన్ని సిద్ధం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు.

  • వారాహిని సిద్ధం చేయండి!

  • నేతలకు పవన్‌ కల్యాణ్‌ ఆదేశం..

  • ఎన్నికల ప్రచారానికి సేనాని సిద్ధం

  • వచ్చే వారం పిఠాపురం నుంచే జనసేన ప్రచారానికి శ్రీకారం

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘వారాహి’ వాహనాన్ని సిద్ధం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నుంచి, వైసీపీ అధినేత జగన్‌ 27 నుంచి ప్రచారానికి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ కూడా జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే వారం పిఠాపురం నుంచే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్‌ దాదాపు 20 రోజులపాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో రెండు సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కాగా, జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు గురువారం తిరుపతి జనసేన నేతలతో సమావేశం కానున్నారు. వారితో చర్చించిన తర్వాత తిరుపతి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

రాజోలులో జెండా ఎగరాలి: పవన్‌

రాజోలులో జనసేన జెండా మరోసారి ఎగరాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. మంగళగిరిలో బుధవారం రాజోలు నియోజకవర్గం పార్టీ నాయకులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దేవ వరప్రసాద్‌తో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితిపై చర్చించారు. ‘‘నియోజకవర్గ ప్రజలు మన మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుందాం. మరోసారి ఇక్కడ మనం గెలిచేలా ముందుకుసాగుదాం’’ అని దిశానిర్దేశం చేశారు.

Updated Date - Mar 21 , 2024 | 07:51 AM

Advertising
Advertising