ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీసీజీ టీకాతో క్షయ వ్యాధికి అడ్డుకట్ట

ABN, Publish Date - Jun 06 , 2024 | 11:54 PM

బీసీజీ టీకా తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని వైద్యాధికారి డాక్టర్‌ మునికుమార్‌ పేర్కొన్నారు.

బీసీజీ టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

తంబళ్లపల్లె, జూన 6: బీసీజీ టీకా తీసుకోవడం వల్ల క్షయ వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని వైద్యాధికారి డాక్టర్‌ మునికుమార్‌ పేర్కొన్నారు. గురు వారం మండలంలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో బీసీజీ టీకా కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ..క్షయ వ్యాధి రాకుండా అర్హులైన ప్రతిఒక్కరూ బీసీజీ టీకాలు వేసుకోవాలన్నారు. ఈ టీకా వేసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి క్షయ వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేయవచ్చన్నారు. 60 సం వత్సరాలు పైబడిన వారు, ధూమపానం, మద్యపానం చేసేవారు, క్షయ వ్యాధి బారినపడి కోలుకున్నవారు, వారి కుటుంబసభ్యులు సైతం టీకా వేసుకోవచ్చని సూచించారు. గురువా రం మండల వ్యాప్తంగా 481 మందికి బీసీజీ టీకా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: బీసీజీ టీకాతో టీబీ వ్యాధిని నివారించవచ్చని మండల ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్‌ పురుషోత్తంనాయక్‌, టీబీ సూపర్‌ వైజర్‌ రామకృష్ణ నాయుడులు పేర్కొన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో వారు పర్యటించి పలువురుకి బీసీజీ టీకాలను వేశారు. ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన వారం దరికి, 18 -60 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న వారికి 5 సంవత్సరాల కిందట టీబీ వ్యాధి వచ్చి తగ్గిన వారికి, షుగర్‌ వ్యాదిగ్రస్తులకు, పొగ తాగేవారికి బీసీజీ టీకాలు వేసి వ్యాధిని నివారించాలని వారు వైద్య సిబ్బందికి సూచించారు. ఆయా గ్రామాల్లో సూమారు 100 మందికి పైగా బీసీజీ టీకాలను వేశారు. కార్యక్రమంలో ఎంపీఎచఏ శేషాద్రితో పాటు ఏఎనఎం రామకృష్ణమ్మ, లతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

కలికిరిలో: వయోజనులకు వేసే బీసీజీ టీకా లతో క్షయ వ్యాధిని నిరోధించవచ్చని మేడికు ర్తి వైద్యాధికారిణి డాక్టర్‌ కావ్యగంధ పేర్కొన్నా రు. గురువారం మండలంలోని ఆర్‌ఎస్‌రోడ్డు, కలికిరి-4 సచివాలయం, బరిణేపల్లెలో బీసీజీ టీకాల కార్యక్రమాలను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు బీసీజీ టీకాల వల్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. 60 ఏళ్ల వయసు పైబడిన వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, టీబీతో కోలుకున్నవారితోపాటు వారి కుటుంబ సభ్యులు, వయసుకు తగ్గ బరువు లేని 18 ఏళ్ల వయసువారు, బీసీజీ టీకాలకు అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో హెచఈ మహ్మద్‌ రఫీ, టీబీ పర్యవేక్షకులు నాగిరెడ్డి, ఎంఎల్‌హెచపీలు కృష్ణకుమారి, పావని, ఏఎనఎమ్‌లు మాధవి, రమాదేవి, ఆశా కార్యకర్తలు జ్యోతి, దీన, లలిత, అంగన వాడీ కార్యకర్త స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో: పీలేరు, కేవీపల్లె మండాలా ల్లో జరుగుతున్న బీసీజీ టీకాల కార్యక్ర మాన్ని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక పరిశీలకుడు డాక్టర్‌ డేనీ ఫ్రాంక్లిన పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ బీసీజీ టీకాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి వయోజనుల ను సంసిద్ధం చేయాలన్నారు. అనంతరం ఆయన టీకాలు పొందుతున్న వయోజనులతో మాట్లాడి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రమేశ రెడ్డి, రేష్మ, చంద్రశేఖర్‌, సీహెచవో భాగ్యలక్ష్మి, హెచఈ కొండయ్య, పీలేరు టీబీ యూనిట్‌ సిబ్బంది మోహన, పవన, ఆరోగ్య సిబ్బంది రిహానా, వెంకటరమణ, చంద్ర, మైత్రి సుధా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:54 PM

Advertising
Advertising