ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

29న రాష్ట్రానికి ప్రధాని రాక

ABN, Publish Date - Nov 15 , 2024 | 03:27 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29న రాష్ట్రానికి రానున్నారు.

ఎన్టీపీసీ ‘గ్రీన్‌’ ప్రాజెక్టులకు శంకుస్థాపన

80వేల కోట్ల పెట్టుబడి... 48వేల మందికి ఉపాధి

విశాఖలో ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయింపు

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29న రాష్ట్రానికి రానున్నారు. ఎన్టీపీసీ రూ.80వేల కోట్ల పెట్టుబడులతో స్థాపించనున్న గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లతోపాటు గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. గురువారం శాసనసభలో ‘క్లీన్‌ ఎనర్జీ’పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రధాని పర్యటన గురించి వెల్లడించారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Nov 15 , 2024 | 03:27 AM