ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ABN, Publish Date - Dec 14 , 2024 | 12:11 AM
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు.
అధికారులకు మంత్రి బీసీ ఆదేశం
బనగానపల్లె, డిసెంబరు 13 (ఆంఽఽరఽధజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. శుక్రవారం బనగానపల్లెలోని టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వివిధ గ్రామాలనుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ఎనడీఏ కూటమి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ ప్రజలనుంచి వచ్చిన అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల పక్షాన నిలిచి వారి సమస్యలను సానుకూలంగా విని స్పందించాలన్నారు. ఫిర్యాదులు పునరావృతమైతే విచారించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
Updated Date - Dec 14 , 2024 | 12:11 AM