AP: ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు.. పోలీసుల ఆంక్షలు
ABN, Publish Date - Oct 14 , 2024 | 09:46 AM
రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించే ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుముగా ప్రభుత్వానికి రూ.1,797 కోట్ల ఆదాయం సమకూరింది.
అమరావతి: రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించే ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుముగా ప్రభుత్వానికి రూ.1,797 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే సోమవారం ఉదయాన్నే ప్రారంభమైన మద్యం దుకాణాల వేలం ప్రక్రియతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. ఎన్నికల కేంద్రాలను తలపిస్తున్నాయి. ఉద్రిక్తతలు తలెత్తకుండా లాటరీ కేంద్రాల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.100 మీటర్ల పరిధిలోనే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారు. కాలినడకతోనే మద్యం లాటరీ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. అయితే లాటరీ దక్కిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దక్కని వారిలో నిరుత్సాహం కనిపిస్తోంది. కొన్ని చోట్ల లాటరీ దక్కిన వారితో సిండికేట్ అయ్యేందుకు మద్యం షాపుల దరఖాస్తుల దారులు బెరసారాలకు దిగుతున్నారు.
తిరుపతిలో..
తిరుపతి శిల్పారామంలో లాటరీ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. జిల్లాలో 227 షాపులకు 3,915 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి అందిన రూ.78.30 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుపతి అర్బన్‌లో 32 షాపులకు రికార్డు స్థాయిలో 985 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపునకు విడి విడిగా లాటరీ తీశారు. లాటరీ పొందిన వారి వివరాలు స్క్రీన్‌పై కనిపించేలా ఏర్పాటు చేశారు.
గుంటూరులో..
వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ లో లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి షాపును వ్యాపారి మల్లిశెట్టి సుబ్బారావు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 127 మద్యం దుకాణాలు ఉన్నాయి.
పల్నాడులో..
నరసరావుపేట టౌన్ హాల్లో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ మొదలైంది. జిల్లాలో 129 మద్యం షాపులకు లాటరీ తీస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 2,639 దరఖాస్తులు వచ్చాయి.
ఏలూరులో...
కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో ఏలూరులో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ షురూ అయింది. జిల్లా వ్యాప్తంగా 144 మద్యం షాపులకు గాను 5,499 దరఖాస్తులు వచ్చాయి.
MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కేబీఆర్ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్
For Latest News and National News click here
Updated Date - Oct 14 , 2024 | 09:46 AM