ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: తుదిదశకు వైసీపీ ఇంచార్జీల మార్పు ప్రక్రియ... నేడే ప్రకటన!

ABN, Publish Date - Jan 11 , 2024 | 03:34 PM

Andhrapradesh: వైఎస్సార్సీపీలో పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి తుది కసరత్తు చేపట్టారు. మార్పులు చేసే నియోజకవర్గాల నేతలను పిలిపించి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

అమరావతి, జనవరి 11: వైఎస్సార్సీపీలో పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి (CM Jagan reddy) తుది కసరత్తు చేపట్టారు. మార్పులు చేసే నియోజకవర్గాల నేతలను పిలిపించి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయమై జోగిరమేష్‌కు ఇప్పటి వరకు స్పష్టత రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 3 గంటలకు మంత్రి జోగిరమేష్‌కు అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. సీఎంను కలిసి తన సీటు విషయమై జోగి రమేష్ చర్చించనున్నారు.


అలాగే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర నాథ్ రెడ్డి , రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తణుకు ఎమ్మెల్యే ,మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై చర్చించేందుకు కాసు మహేశ్వ‌రెడ్డిని అధిష్టానం పిలిపించింది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సమావేశంకానున్నారు.

కాగా.. సీట్లు రాని వారి తిరుగుబాటు నేపథ్యంలో మూడవ జాబితాపై అధిష్టానం ముహూర్తాలు చూసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఎక్కడా ఇబ్బందికర వాతావరణం లేకుండా అంతా సెట్ అయ్యాకే పేర్లు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్ ఇష్యూల తరువాత అధిష్టానం ఆచితూచి అడుగులు ముందుకువేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకూ అమావస్య ఉండడంతో 7 తరువాత లేదా రేపు (శుక్రవారం) జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 11 , 2024 | 03:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising