నాయి బ్రాహ్మణులపై పుట్టా మహేష్ వరాల జల్లు
ABN, Publish Date - Apr 12 , 2024 | 08:14 PM
నాయి బ్రాహ్మణులపై ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ వరాల జల్లు కురిపించారు. శుక్రవారం నగరంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో మహసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏలూరు, ఏప్రిల్ 12: నాయి బ్రాహ్మణులపై ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ (Putta mahesh yadav) వరాల జల్లు కురిపించారు. శుక్రవారం నగరంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి ఆధ్వర్యంలో మహసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు వరకు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
AP Politics: వైఎస్ షర్మిల పర్యటనలో ఉద్రిక్తత.. అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
అలాగే ద్వారకా తిరుమలలో నాయి బ్రాహ్మణుల కోసం నూతనంగా కళ్యాణ మండపం నిర్మిస్తామని చెప్పారు. ఇక మున్సిపాలిటీ, పంచాయతీ పరిధిలో సెలూన్ షాపులు కేటాయించి.. వారి అబివృద్ధికి దోహదపడతామన్నారు. ఈ ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అన్ని విధాలుగా ఆదుకుంటామని.. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులకు ఆయన భరోసా ఇచ్చారు.
అయితే ఈ ఎన్నికల్లో జగన్‌ను గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమైనాయి. ఆ క్రమంలో బీజేపీ, జనసేనతో టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడింది. అందులోభాగంగా ఆయా పార్టీల మధ్య సీట్ల పంపకాలు చేసుకున్నాయి. దీంతో ఏలూరు లోక్‌సభ స్థానం టీడీపీకి కేటయించారు.
దాంతో పుట్ట మహేష్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక ఎన్నికల సమీపిస్తున్నాయి. దీంతో ఆయన తన ప్రచార వేగాన్ని పెంచారు. అలాగే ఏలూరు లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఏపీ వార్తలు కోసం...
Updated Date - Apr 12 , 2024 | 08:14 PM