విద్యుత సమస్యలపై సత్వర పరిష్కారం
ABN, Publish Date - Dec 11 , 2024 | 12:22 AM
విద్యుత వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారానికి విద్యుత అధికారులు ఎప్పుడూ ముందుంటారని ఏపీఎ్‌సపీడీసీఎల్ చైర్మన శ్రీనివాస ఆంజనేయమూర్తి, కర్నూలు ఎస్‌ఈ ఉమాపతి అన్నారు.
ఏపీఎ్‌సపీడీసీఎల్ చైర్మన శ్రీనివాస ఆంజనేయమూర్తి
మంత్రాలయం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యుత వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారానికి విద్యుత అధికారులు ఎప్పుడూ ముందుంటారని ఏపీఎ్‌సపీడీసీఎల్ చైర్మన శ్రీనివాస ఆంజనేయమూర్తి, కర్నూలు ఎస్‌ఈ ఉమాపతి అన్నారు. మంగళవారం మంత్రాలయం విద్యుత సబ్ స్టేషన ఆవరణలో ట్రాన్సకో ఈఈ డీఎన విజయరాజు, మంత్రాలయం డీఈ విశ్వశాంతి స్వరూప్ అధ్యక్షతన ప్రత్యేక విద్యుత అవగాహన సదస్సు, అదాలత నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, గూడూరు ప్రాంతాల్లోని రైతులు, గ్రామస్థుల నుంచి విద్యుతపై ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత సరఫరాలో నిర్లక్ష్యం వహించకుండా నాణ్యమైన విద్యుతను అందిస్తున్నామన్నారు. గృహాలు, ఫ్యాక్టరీలు, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా విద్యుత ఉత్పత్తికి ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేసుకుంటోందన్నారు. విద్యుతలో ఎటువంటి అవరోధాలు ఉన్నా రైతులు ట్రాన్సఫార్మర్లు, విద్యుత స్తంభాలు, వైర్లు వంటివి కొరత ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. సమావేశంలో ఎమ్మిగనూరు డీఈ నాగేంద్ర ప్రసాద్, గూడూరు డీఈ జేసన, ఏఈలు గోవిందు, సుబ్బారెడ్డి, నరసన్న, వీరేష్, ప్రసన్నకుమార్, గురుమూర్తి, నాగవేంద్రం, సుధాకర్, శ్రీనివాస్ నాయక్, మధుసూదన, ఏవో మల్లికార్జున, చాంద్‌బాషా, రంగస్వామి, భీమయ్య, దివాకర్, వీరేష్ పాల్గొన్నారు.
Updated Date - Dec 11 , 2024 | 12:22 AM