ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉప సభాపతిగా రఘురామ ఏకగ్రీవం

ABN, Publish Date - Nov 14 , 2024 | 04:44 AM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి పదవికి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గడువులోగా ఒకటే నామినేషన్‌ దాఖలు

నామినేషన్‌ పత్రాలపై డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేశ్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు సంతకాలు

నేడు సభలో ప్రకటించనున్న స్పీకర్‌ అయ్యన్న

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి పదవికి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సభాపతి పదవికి కూటమి అభ్యర్థిగా ఆయన పేరును మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ పదవికి రఘురామ పేరును ప్రతిపాదిస్తూ టీడీపీ తరఫున మంత్రి లోకేశ్‌, జనసేన తరఫున డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌ రాజు సంతకాలు చేశారు. ఈ కాపీలతో కూడిన మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్న కుమార్‌ సూర్యదేవరకు సాయంత్రం 4.30 గంటలకు రఘురామకృష్ణరాజు అందించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ గడువు ముసిసేలోగా.. రఘురామ తప్ప మరెవ్వరు నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఉప సభాపతిఏకగ్రీవ ఎన్నికను గురువారం శాసనసభలో స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించే అవకాశం ఉంది.

అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌ సందడి..

ఉప సభాపతిగా తన పేరు ఖరారు కావడంతో రఘురామకృష్ణరాజు బుధవారం అసెంబ్లీలో సందడి చేశారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అభినందనలు తెలిపారు. ఉపసభాపతికి అసెంబ్లీ అధికారులు కేటాయించిన చాంబర్‌ను స్వయంగా రఘురామకృష్ణరాజు పరిశీలించి చిన్న చిన్న మార్పులు సూచించారు. గురువారం మధ్యాహ్నం 2.39 గంటలకు డిప్యూటీ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 04:44 AM