రేషనదుకాణాలపై దాడులు
ABN, Publish Date - Nov 03 , 2024 | 11:38 PM
గోనెగండ్లలోని రేషనదుకాణాలపై శనివారం రాత్రి విజిలెన్స అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
గోనెగండ్ల, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): గోనెగండ్లలోని రేషనదుకాణాలపై శనివారం రాత్రి విజిలెన్స అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గోనెగండ్లలో 11 రేషనదుకాణాలు ఉండగా అందులో ఎనిమిది దుకాణాలను అధికారులు రికార్డులను, స్టాక్ రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. అందులో 1320004 అనే రేషనదుకాణంలో 143 కేజీల బియ్యం తక్కువ వచ్చినట్లు అధికారుల విచారణలో తెలింది. అయితే ఆ దుకాణం యజమాని తన దగ్గర బియ్యం తక్కువ లేవు లెక్క ప్రకారం ఉన్నాయి. మిగతా బియ్యం ఎంబీయూ దగ్గర ఉన్నాయని తెలిపినప్పటికీ అధికారులు వినలేదని ఎంబీయూతో రిటర్న్ కొట్టించి తన దగ్గర తక్కువ ఉన్నట్లు లెక్క చూపారని రేషన దుకాణం యజమాని వాపోయాడు. తాను ఎంత చెప్పినప్పటికి అఽధికారులు వినిపించుకోక పోవడమే గాక తన పై కేసు నమోదు చేయడం పట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 1320036 రేషనదణంలో 1115 కేజీల బియ్యం తక్కువ ఉన్నట్లు విచారణలో తెలింది. అయితే ఈ రెండు దుకాణాల పై 6ఏ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్సఎనఫోర్స్‌మెంట్ అధికారులు రామకృష్ణ, సునీల్‌కుమార్ ఆదివారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. మిగతా ఆరు దుకాణాలను తనిఖీలు చేసి ఇరెగ్యూలర్ కింద హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో సిద్దయ్య, రమన, వీర్వోలు పాల్గొన్నారు.
విజిలెన్సఎనఫోర్స్‌మెంట్ అధికారుల దాడులతో అప్రమత్తం
శనివారం రాత్రి గోనెగండ్లలోని రేషన దుకాణాలపై ఆకస్మికంగా విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించడంతో మండలంలోని పలు గ్రామాలలో ఉన్న రేషనషాపుల డీలర్ల అప్రమత్తమయ్యారు. మండల వ్యాప్తంగా 43 రేషనదుకాణాలు ఉన్నాయి. ఇంత వరకు ఎప్పుడు అర్ధరాత్రి వరకు రేషన దకాణాలపై విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసిన సంఘటనలు లేవు. ఇప్పడు జరగడంపై డీలర్లు తమ తప్పుఒప్పులను సరిచేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
Updated Date - Nov 03 , 2024 | 11:38 PM