అన్నదాత.. అగచాట్లు!
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:38 AM
ఫెంగల్ తుఫాన్ ప్రభావం జిల్లాపై ఉండదని భావించినప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. మాసూళ్ల సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల రహదారులపై ఆర బెట్టిన ధాన్యం, కల్లాల్లోని ధాన్యం తడిచి పోయింది.
ఫెంగల్ తుపాను ప్రభావం
జిల్లాలో కురుస్తున్న వర్షాలు
ధాన్యాన్ని బరకాలతో కప్పి రక్షించుకుంటున్న రైతులు
మరో రెండు రోజులపాటు వర్షసూచనలతో దిగాలు
వరి కోతలు ఆపండి : జేసీ
ఏలూరు సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఫెంగల్ తుఫాన్ ప్రభావం జిల్లాపై ఉండదని భావించినప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. మాసూళ్ల సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల రహదారులపై ఆర బెట్టిన ధాన్యం, కల్లాల్లోని ధాన్యం తడిచి పోయింది. దీంతో రైతులు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. బరకాలపై ఉన్న నీళ్ళను బక్కెట్లతో తోడుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది 77 వేల 446 హెక్టార్లలో సార్వా వరి సాగు చేయగా ఇప్పటివరకు 27 వేల 247 హెక్టార్లలో మాత్రమే వరి కోతలు పూర్త య్యా యి. 35 శాతం మాత్రమే వరి మాసూళ్లు పూర్త యినట్టు జిల్లా వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఉత్తర కోస్తాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు తమ వరి పంటను రక్షించుకోవటానికి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కోసిన వరి పంటను ప్రస్తుతం బరకాలు కప్పి రక్షించుకుం టున్నామని, ఇంకా భారీగా వర్షాలు కురిస్తే ధాన్యం మొత్తం తడిసి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆరబెట్టిన ధాన్యంలో కూడా తేమశాతం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వర్షపాతం
జిల్లాలో శనివారం ఉద యం 8.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వర కు జిల్లాలో అత్యధి కంగా ఉంగుటూరు మండలంలో 4.4 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో సరాసరి వర్షపాతం 1.1 మి.మీ నమోదైంది. ఉంగుటూరులో 4.4, ఏలూరు రూరల్ 4, ఏలూరు అర్బన్ 3.2, ముదినేపల్లి 3, నిడమర్రు 3 మి.మీ వర్షపాతం నమోదుకాగా జిల్లాలోని మిగిలిన మండలాల్లో 3 మి.మీ కన్నాతక్కువగానే వర్షాలు కురిశాయి.
రాబోయే రెండు రోజులు
వరి కోతలు కోయవద్దు : జేసీ
దెందులూరు/ భీమడోలు/ ఉంగుటూరు/ పెదవేగి : ఫెంగల్ తుఫాను కారణంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని, వర్షాలకు రాబోయే రెండు రోజులో వరి కోతలు కోయ వద్దని జేసీ ధాత్రిరెడ్డి రైతులను కోరారు. తుఫాన్ వల్ల ఏ రైతు నష్ట పోకుండా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. దెందులూరు మండలం దెందు లూరు, కొత్తగూడెం, సీతంపేట, భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో, ఉంగుటూరు మండలంలోని గోపీనాథపట్నంలోని పొలాల్లో ఉన్న ధాన్యం రాశులను జేసీ శనివారం పరిశీలించారు. ధాన్యం తడవకుండా రైతులకు అవసరమైన టార్ఫాలిన్‌లను అందు బాటులో ఉంచామన్నారు. తేమ శాతం ఒకటి లేక రెండు శాతం ఎక్కువగా ఉన్నా మిల్లులకు వెంటనే పంపించాలని సూచించారు. అధికారులు తమ మండల కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉండాల న్నారు. ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నంబరు 1800 425 6453కి తెలపాల న్నారు. దెందులూరు తహసీల్దార్ సుమతి, రెవెన్యూ అధికారి హేమమాలిని, భీమడోలు ఏవో ఉషారాణి, ఉంగుటూరు ఇన్‌చార్జి తహసీల్దార్ వై.పూర్ణ చంద్ర ప్రసాద్, వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్ ఆమె వెంట ఉన్నారు.
టార్ఫాలిన్లు సరఫరా చేస్తాం : వ్యవసాయ శాఖ జేడీ
ధాన్యం తడవకుండా రైతులకు టార్ఫాలిన్ లను సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎస్‌కే హబీబ్‌బాషా తెలిపారు. పెదవేగి మండలం అమ్మపాలెం, దుగ్గిరాలల్లో శనివారం పర్యటించారు. జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు పడుతున్న అవస్థలను స్వయంగా పరిశీలిం చారు. ధాన్యం కొనుగోలును వేగవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మండల వ్యవసాయాధికారిణి ఎం.ప్రియాంక, వీఏఏలు ధనరాజ్, శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:38 AM