ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోత పత్రిక విషపు రాతలు

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:45 AM

జగన్‌ అవినీతి, అసత్యాలతో పుట్టిన రోత పత్రిక పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంపై నిత్యం విషం కుమ్మరిస్తోందని, అడ్డగోలు రాతలు రాస్తోందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

45.72 మీటర్ల ఎత్తులో పోలవరం కట్టి తీరుతాం

అబద్ధాలకు జగన్‌ పేటెంట్‌.. అవినీతిలో అనకొండ: నిమ్మల

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జగన్‌ అవినీతి, అసత్యాలతో పుట్టిన రోత పత్రిక పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంపై నిత్యం విషం కుమ్మరిస్తోందని, అడ్డగోలు రాతలు రాస్తోందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి తీరతామని స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019-24 నడుమ జగన్‌ విధ్వంసానికి బలైన ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతుంటే.. తట్టుకోలేక జగన్‌ పత్రిక విషపు రాతలు రాస్తోందన్నారు. విషబీజాలు నాటుతోందని ధ్వజమెత్తారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు ఫేజ్‌-1, 2 అని గానీ, ఎత్తు 41.15 మీటర్లు అని గానీ డిజైన్లలో, అంచనాల్లో, రికార్డుల్లో ఎక్కడైనా చెప్పినట్లు ఒక్క సాక్ష్యం చూపించాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులకు సవాళ్లు విసితే వారి నుంచి స్పందన లేదని చెప్పారు. ‘ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా మండలి (టీఏసీ) రికార్డులున్నాయి. 2019 ఫిబ్రవరి 18న టీఏసీ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు ఆమోదించింది.

దీని ఆధారంగా 2021లో జగన్‌ పాలనలో కుడికాలువ, ఎడమకాలువ నీటి సామర్ధ్యం తగ్గించి, తద్వారా రూ.47,617 కోట్ల సవరణ అంచనాకు సాంకేతిక కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టు చరిత్రలో చెన్నారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు వరకు ఎక్కడా ఫేజ్‌-1, 2.. ఎత్తు 41.15 మీటర్లు అని లేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద పలువురి ప్రశ్నలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఇది వైసీపీ నేతలకు, మొసలి కన్నీరు కారుస్తున్న మాజీ ఇరిగేషన్‌ మంత్రులకు చెంపదెబ్బ. 2021లో 41.15 మీటర్ల ఎత్తు అనే దానికి బీజం వేసింది జగనే. ప్రధాన డ్యాంలో 45.72 మీటర్లు కాకుండా 41.15 మీటర్ల ఎత్తునే నీటి నిల్వను పరిమితం చేయాలని నాడు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపిందని పీపీఏ వివరణ ఇచ్చింది. అయినా 100 సార్లు అబద్ధం చెప్పి.. దానిని నిజం చేయాలని జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనించాలి’ అని కోరారు. అబద్ధాలకు జగన్‌ పేటెంట్‌ అని, అవినీతిలో అనకొండ అని విమర్శించారు. అదానీతో విద్యుత్‌ ఒప్పందాల అవినీతి కేసులో తన పేరు లేదంటూ జగన్‌ లాజిక్‌గా మాట్లాడుతున్నారని, మరి అప్పుడు సీఎం భారతీరెడ్డా.. సజ్జలా.. పెద్దిరెడ్డా అని నిమ్మల నిలదీశారు.

Updated Date - Nov 30 , 2024 | 03:45 AM