డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ: వరప్రసాద్
ABN, Publish Date - Jun 09 , 2024 | 03:04 AM
రేషన్ సరుకులను పూర్వపు పద్ధతిలో డీలర్ల ద్వారానే పంపిణీ చేసేలా కృషి చేస్తానని రాజోలు జనసేన ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ హామీ ఇచ్చారు.
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): రేషన్ సరుకులను పూర్వపు పద్ధతిలో డీలర్ల ద్వారానే పంపిణీ చేసేలా కృషి చేస్తానని రాజోలు జనసేన ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ హామీ ఇచ్చారు. విజయవాడలో శనివారం జరిగిన రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లీలామాధవరావు మాట్లాడుతూ ఎండీయూ వ్యవస్థను తొలగించి డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆథరైజేషన్ ఉన్న డీలర్లందరికీ గౌరవవేతనం చెల్లించాలని కోరారు. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. పలు జిల్లాల డీలర్ల సమాఖ్య నూతన కమిటీలను ఎన్నుకున్నారు.
Updated Date - Jun 09 , 2024 | 03:04 AM