బాధ్యతగా సభ్యత్వ నమోదు చేయండి : ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:28 PM
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈనెల 26 నుంచి నిర్వహిస్తున్నామని, ఇందులో అందరూ బాధ్యతయుతంగా పని చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు
కదిరి, అక్టోబరు 21 (ఆంరఽధజ్యోతి) : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈనెల 26 నుంచి నిర్వహిస్తున్నామని, ఇందులో అందరూ బాధ్యతయుతంగా పని చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. సోమ వారం పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బూతులు.. సామాజిక వర్గాల వారీగా పూర్తి చేయా లన్నారు. టీడీపీలో సభ్యత్వం తీసు కుంటే రూ.ఐదు లక్షల బీమా ఉంటుం దని, ఇతర సౌకర్యాలు కూడా అందుతా యని అన్నారు. అనంతరం ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి 12 మంది బాధితులకు మంజూరైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పట్టణాఽధ్య క్షుడు డైమండ్ ఇర్షాన, ఫర్వీనాభాను, పవనకుమార్‌రెడ్డి, బాహుద్దీన, మనోహర్‌నాయుడు, ఎంఎన ఫయాజ్, రాజశేఖర్‌బాబు, కౌన్సిలర్లు, సర్పంచలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:28 PM