Renu Desai: నెరవేరిన ఆద్య కోరిక.. రేణుదేశాయ్ ఎమోషనల్
ABN, Publish Date - Jun 13 , 2024 | 04:59 PM
ఆంధ్రప్రదేశ్లో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఆ సమయంలో పవన్ భార్య అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ ఉన్నారు. అకీరా హైట్ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు. పవన్ కూతురు ఆద్య ఢిల్లీ వెళ్లలేక పోయింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఆ సమయంలో పవన్ భార్య అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ ఉన్నారు. అకీరా హైట్ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు. పవన్ కూతురు ఆద్య ఢిల్లీ వెళ్లలేక పోయింది. తర్వాత ఆద్య ప్రధాని మోదీని కలిసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం కొలువుదీరింది. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు మాట్లాడారు. అకీరా నందన్ తన చెల్లి ఆద్యను ప్రధాని మోదీకి పరిచయం చేశారు. ఆ వీడియోను తల్లి రేణుదేశాయ్ ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘నాన్న పవన్ కల్యాణ్, సోదరుడు అకీరాతో కలిస ఆద్య ఢిల్లీకి వెళ్లలేదు. ఆ రోజు స్కూల్ ఓపెన్ కావడంతో వీలు పడలేదు. ప్రధాని మోదీని మీట్ కావాలనేది ఆద్య కోరిక. ఆ కల నిన్న (బుధవారం) తీరింది. ఆద్యను ప్రధాని మోదీకి అకీరా పరిచయం చేశారు. నేను కూడా బీజేపీ అంటే అమితంగా ఆరాధిస్తా. తన పిల్లలు మోదీని కలువడం సంతోషంగా ఉంది. పవన్ రాజకీయ నేత అయినందున మా పిల్లలు ప్రధాని మోదీని కలిసే అవకాశం కలిగింది. అలా ఆద్య చిరకాల కోరిక తీరింది అని’ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.
‘తొలి నుంచి బీజేపీ అంటే తనకు అభిమానం. ప్రధాని మోదీ పక్కన తన కుమారుడు అకీరా ఉండటం చూసి సంబరపడ్డా. ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేను. మోదీని కలిసిన తర్వాత అకీరా తనకు ఫోన్ చేశాడు. మోదీ చాలా గొప్ప వ్యక్తి. అతని చుట్టూ పాజిటివ్ వైబ్ ఉంటుంది అని నాతో చెప్పాడు అని’ రేణుదేశాయ్ స్పష్టం చేశారు. తన పిల్లలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువడం పట్ల మాత్రం రేణుదేశాయ్ బావోద్వేగానికి గురయ్యారు.
Updated Date - Jun 13 , 2024 | 05:28 PM