ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరారీలో విశ్రాంత ఐపీఎస్‌ విజయ్‌పాల్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:22 AM

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి విజయ్‌పాల్‌ పరారీలో ఉన్నారని, దర్యాప్తు అధికారులకు అందుబాటులో లేరని పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించారు.

సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఐపీఎస్‌ అధికారి విజయ్‌పాల్‌ పరారీలో ఉన్నారని, దర్యాప్తు అధికారులకు అందుబాటులో లేరని పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించారు. నోటీసులు ఇచ్చేందుకు అధికారులు పలుసార్లు పిటిషనర్‌ ఇంటికి వెళ్లినా, ఆ ఇంటికి తాళం వేసి ఉంటోందని తెలిపారు. దర్యాప్తుకు సహకరించనివారు ముందస్తు బెయిల్‌ పొందేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఈ దశలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది స్పందిస్తూ... బాధితుడిగా వ్యాజ్యంలో ఇంప్లీడ్‌ అయ్యి వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కోరారు. అనారోగ్య కారణాలతో సీనియర్‌ న్యాయవాది విచారణకు హాజరు కాలేకపోయారని, విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రఘురామ వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి స్పందిస్తూ వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 03:22 AM

Advertising
Advertising