ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుంటూరు కోర్టుకు బోరుగడ్డ

ABN, Publish Date - Nov 30 , 2024 | 04:26 AM

రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ను శుక్రవారం గుంటూరు పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంటుపై కోర్టులో హాజరు పరిచారు.

పట్టాభిపురం కేసులో 14 రోజులు రిమాండ్‌

తిరిగి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలింపు

గుంటూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ను శుక్రవారం గుంటూరు పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంటుపై కోర్టులో హాజరు పరిచారు. ఈ ఏడాది జూన్‌ 1న ఓ సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే విడుదల చేయగానే బోరుగడ్డ చెలరేగిపోయాడు. ‘మా వైసీపీ ప్రభుత్వం రాబోతోంది’ అంటూ ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేశాడు. తీవ్ర వ్యాఖ్య లు చేస్తూ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించాడు. ఆయన సామాజిక వర్గానికి చెందిన మహిళలను అత్యాచారం చేస్తానని, ఇళ్లల్లోకి వచ్చి చంపేస్తా... అంటూ రాయడానికి వీలు లేని భాషలో దూషించాడు. దీనిపై గుంటూరు నగరంలోని విజయపురి కాలనీ నాలుగో లైన్‌కి చెందిన గని వెంకటేశ్వర్లు జూన్‌ 3న పట్టాభిపురం పోలీస్‌ ేస్టషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పలు కేసుల్లో నిందితుడైన బోరుగడ్డ అనిల్‌ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. దీంతో తాజాగా శుక్రవారం వట్టాభిపురం పోలీసులు రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ను రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి గుంటూరులోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయాధికారి స్పందన, 14 రోజులు రిమాండ్‌ విధించడంతో బోరుగడ్డను తిరిగి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. ఇక, అనిల్‌ను వారం రోజుల పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయాలని పట్టాభిపురం పోలీసులు నిర్ణయించారు.

Updated Date - Nov 30 , 2024 | 04:26 AM