ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rs. 10 lakh in arrears : రూ. 10 లక్షల బకాయిలపై ఆరా

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:24 PM

స్త్రీనిధి సొమ్ము స్వాహాపై విచారణ చేస్తున్నట్లు స్త్రీనిధి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఉద య్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఎగువగొట్టివీడు గ్రామం గొల్లపల్లెలో స్త్రీనిధి బకాయిలపై విచారణ జరిపారు.

ఎగువగొట్టివీడులో విచారణ చేస్తున్న అధికారులు

స్త్రీనిధి సొమ్ము స్వాహాపై విచారణ

రికవరీ జరగకపోతే చట్టపర చర్యలు

స్త్రీనిధి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఉదయ్‌కుమార్‌

గాలివీడు, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): స్త్రీనిధి సొమ్ము స్వాహాపై విచారణ చేస్తున్నట్లు స్త్రీనిధి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఉద య్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఎగువగొట్టివీడు గ్రామం గొల్లపల్లెలో స్త్రీనిధి బకాయిలపై విచారణ జరిపారు. మండలం లో మొత్తం రూ.10 లక్షల వరకు బకాయిలు ఉండగా అందు లో అత్యధికంగా గొట్టివీడు గ్రామం గొల్లపల్లెలో స్త్రీనిధి సొమ్ము రూ.4.15 లక్షల బకాయిలు ఉన్నాయన్నారు. ఇదే విషయమై మహిళా సంఘ సభ్యులను విచారించగా ఇప్పటికే చాలా వర కు బకాయిలు చెల్లించామని, అయినా ఎక్కువ మొత్తంలో అప్పు చూపిస్తున్నట్లు ఆరోపిస్తున్నారన్నారు. అయితే అవి బకాయిలా లేక వెలుగు సిబ్బంది చేతివాటంతో నిలిచిపోయిన అప్పా అనే విషయం క్షేత్రస్థాయిలో రసీదులు, బుక్కులు క్షుణ్ణంగా పరిశీ లించాల్సి ఉందన్నారు. మండలంలో గుండ్లచెరువు రూ.80,900, సీసీ పల్లె రూ.65 వేలు, తూముకుంట రూ.29,500, అరవీడు రూ.32,000 బకాయిలు ఉన్నాయన్నారు. శనివారం జరిగిన విచారణలో రూ.1,20,000 రికవరీ కాగా అందులో గుండ్ల చెరువు నుంచి రూ.30 వేలు, నూలివీడు రూ.75 వేలు, పూలుకుంట రూ.15 వేలు ఉన్నట్లుగా తెలిపారు. విచారణ అధికారులు పారదర్శకంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి స్వాహా అయిన స్త్రీనిధి సొమ్మును రికవరీ చేసి, కారకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యక్రమంలో స్త్రీనిధి మేనేజర్‌ మౌనిక, లీగల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసులు, ఏపీఎం పెద్దరెడ్డెయ్య, సీసీలు, యానిమేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:24 PM