Gottipati Ravikumar : లైన్‌మెన్ కుటుంబానికి 25 లక్షలు
ABN, Publish Date - Sep 06 , 2024 | 05:25 AM
విధులు నిర్వర్తిస్తూ వరదలో కొట్టుకుపోయి మరణించిన లైన్‌మెన్ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.25 లక్షలు అందజేశారు.
మృతుడి భార్యకు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): విధులు నిర్వర్తిస్తూ వరదలో కొట్టుకుపోయి మరణించిన లైన్‌మెన్ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.25 లక్షలు అందజేశారు. మంత్రితోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు గురువారం వజ్రాల కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి పరిహారం అందించారు. అదేవిధంగా సంస్థ నుంచి కోటేశ్వరరావుకు రావాల్సిన రూ.13లక్షలను మంత్రి అందజేశారు. పిల్లల చదువుకు ఏటా రూ.25 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. దీంతోపాటు కోటేశ్వరరావు భార్యకు విద్యుత్ సంస్థలో ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేశారు. విద్యుత్ సంస్థల ఉద్యోగుల భద్రతపై మంత్రి గొట్టిపాటి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మృతి చెందిన లైన్‌మెన్ ఇంటికి మంత్రి స్వయంగా వెళ్లి పరిహారం అందజేయడంపై విద్యుత్ సంస్థల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Sep 06 , 2024 | 05:25 AM