పరుగుల నవ యువకుడు
ABN, Publish Date - Dec 14 , 2024 | 12:04 AM
ఆయనకు అరవైఏళ్లు. కానీ పరుగుల రారాజు. ఇరవై ఏళ్ల యువకుడిలా పరుగుల్లో పోటీపడి పతకాలు సాధిస్తారు.
50కుపైగా రాష్ట్ర స్థాయిలో పతకాలు
ఫిలిప్పైన్స, స్వీడనలలో ప్రతిభను చాటుకొన్న ధీరుడు
చదివింది డిగ్రీ, వృత్తిరీత్యా ప్యాబ్రికేటర్
ఆదోని టౌన, డిసంబరు12 (ఆంధ్రజ్యోతి) : ఆయనకు అరవైఏళ్లు. కానీ పరుగుల రారాజు. ఇరవై ఏళ్ల యువకుడిలా పరుగుల్లో పోటీపడి పతకాలు సాధిస్తారు. వదిలిన బాణంలా ఊహించని రీతిలో పరుగులు తీసి అబ్బురపరుస్తారు. ఆయనే పట్టణానికి చెంది ఖాజా బందే నవాజ్. రన్నింగ్ (హార్డల్స్)లో మన దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం తన ప్రతిభను చాటుకున్నారు.
ఖాజా బందే నవాజ్ 20 సంవత్సరాలుగా క్రీడా జగత్తులో తన ప్రతిభను చాటుకుంటున్నారు. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తరపున ఫుట్ బాల్‌తో పాటు రన్నింగ్ రేస్ పోటీలలో పాల్గొని అనేక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలలో 50కుపైగా పతకాలు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలు కైవసం చేసుకొన్నారు. 2022లో చెన్నైలో జరిగిన నేషనల్స్‌లో వంద మీటర్ల రన్నింగ్ రేస్‌లో బ్రాస్ మెడల్, 2023లో కలకత్తాలో జరిగిన నేషనల్స్‌లో వంద మీటర్ల రన్నింగ్ (హార్డల్స్)లో సిల్వర్ మోడల్, 400మీటర్ల రన్నింగ్ (హార్డల్ప్)లో బ్రాస్ మెడల్ లభించింది. 2024లో పూణేలో జరిగిన నేషనల్స్‌లో 100మీటర్ల రన్నింగ్ రేస్ (హార్డల్స్)లో గోల్డ్ మెడల్, 300మీటర్ల రన్నింగ్ రేస్ (హార్డల్స్)లో బ్రాస్ మెడల్, 100మీటర్ల రన్నింగ్ రేస్‌లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకొన్నారు. ఇంటర్నేషనల్స్‌లో సైతం చాటుకొన్న ప్రతిభ ఈ వృద్ధ క్రీడాకారుడు విదేశాలలో సైతం తన మెరుపు వేగాన్ని ప్రదర్శించి పలువురి ప్రశంసలు పొందారు. 2023లో ఫిలిప్పైన్సలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో 100మీటర్ల హార్డల్స్ రన్నింగ్ రేస్‌లో నాలుగవ స్థానం, 400మీటర్ల హార్డల్స్ రన్నింగ్ రేస్‌లో ఐదో స్థానం లభించింది. 2024లో స్వీడనలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అంటారు. ఖాజా బందే నవాజ్‌కు 100,400మీటర్ల హార్డల్స్ రన్నింగ్ రేస్‌లలో కూడా పాల్గొని తన సత్తాను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇది తనకు మరిచిపోని అనుభవం అంటారు.
ఫ చదివింది డిగ్రీ, వృత్తి రీత్యా ఫ్యాబ్రికేటర్
ఖాజా బందే నవాజ్ డిగ్రీ దాకా చదుకొని ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఫ్యాబ్రికేటర్ వృత్తిని ఎంచుకొని అందులో స్థిరపడ్డారు. చదువుకొనే రోజుల నుండి క్రీడలపై ఎక్కువ మక్కువ ఉండేదని, ఇంటర్నేషనల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలన్నదే తన ఆశయమని నవాజ్ అంటున్నారు.
Updated Date - Dec 14 , 2024 | 12:04 AM