ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీర గ్రామాల్లో ఇసుక పండుగ

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:10 AM

రీచ్‌ల నుంచి ఎద్దుల బండ్లతో పాటు ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా ఇసుక తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో అందరికీ ఇసుక తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది. సామాన్యుల గృహ నిర్మాణ కష్టాలు తీరడంతో పాటు కూలీల ఉపాధికి ఇక ఢోకా ఉండదని తెలిసి తీర గ్రామాల్లో ప్రజలు ఇసుక పండుగ జరుపు కుంటున్నారు.

-ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఉచితంగా తీసుకెళ్లమనడంపై సర్వత్రా హర్షం

-సీఎం చంద్రబాబు సాహసోపేత నిర్ణయానికి కృతజ్ఞతలు

-ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ డివిజన్‌లో పుష్కలంగా ఇసుక నిల్వలు

-తీరనున్న సామాన్యుల ఇంటి నిర్మాణ కష్టాలు

రీచ్‌ల నుంచి ఎద్దుల బండ్లతో పాటు ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా ఇసుక తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో అందరికీ ఇసుక తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది. సామాన్యుల గృహ నిర్మాణ కష్టాలు తీరడంతో పాటు కూలీల ఉపాధికి ఇక ఢోకా ఉండదని తెలిసి తీర గ్రామాల్లో ప్రజలు ఇసుక పండుగ జరుపు కుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి-కంచికచర్ల):

ఎన్‌టీఆర్‌ జిల్లాలో నందిగామ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణానదితో పాటుగా పాలేరు, వైరాయేరు, కట్లేరు, మునేరు ప్రవహిస్తుండటంతో ఇసుకకు ఎలాంటి కొరత లేదు. అయినప్పటికీ తీర గ్రామాల్లో ఇసుక కోసం సామాన్యులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని అడుగుల దూరంలోనే ఇసుక ఉన్నప్పటికీ సవాలక్ష ఆంక్షలతో ఇసుక అందని ద్రాక్షగా తయారైంది. రూ.వేలకు వేలు చెల్లించేందుకు సిద్ధపడినప్పటికీ ఇసుక దొరకటం గగనమైంది. నిర్మాణ రంగం కుంటుపడటంతో కూలీలకు ఉపాధి దొరకని దుస్థితి నెలకొంది. పసిడిగా తయారైన ఇసుక దోపిడీపై శ్రద్ధ పెట్టిన వైసీపీ పాలకులు నిబంధనలు ఉల్లఘించి నదుల గర్భాలను యంత్రాలతో కొల్లగొటి సరిహద్దులు దాటించి అమ్ముకున్నారు. దీంతో స్థానికంగా ఇసుక అందుబాటులో లేకుండా పోయింది.

పేదల కష్టాలను చూసే ఉచిత ఇసుక విధానం

అయితే పేదలు, కూలీల కష్టాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు గతంలో మాదిరిగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా స్టాక్‌ పాయింట్లలో ఉన్న ఇసుకను విక్రయించారు. రవాణా ఖర్చులు, సీనరేజీ, జీఎస్టీ, ఇతరత్రా పన్నులు కలిపి టన్ను రూ.290 ధర నిర్ణయించారు. స్టాక్‌ పాయింట్ల వద్ద నేతలు, అధికారులు కుమ్మక్కు కావడంతో ధర అందుబాటులో లేకుండా పోయింది. ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రవేశపెట్టినప్పటికీ వెసులుబాటు కలగలేదు. లారీకి కేవలం 20 టన్నులు మాత్రమే లోడింగ్‌ చేయటం వల్ల ఒకవైపు లారీ యజమానికి గిట్టుబాటు కాలేదు, మరోవైపు విజయవాడ, ఏలూరు ఇతర పట్టణాల్లో వినియోగదారులు అధిక ధర చెల్లించాల్సి వచ్చింది. మరోవైపు నేతల ఒత్తిళ్లతో ట్రాక్టర్లపై అధికారులు కొరఢా ఝులిపించటం ప్రారంభించారు. వాల్టా కేసులు నమోదు చేశారు. ఉచిత ఇసుక విధానం వల్ల కూటమి ప్రభుత్వానికి తగినంత మైలేజీ రాకపోగా, ఎక్కడికక్కడ స్థానిక నేతల పెత్తనం వల్ల చెడ్డపేరు వచ్చే పరిస్థితి తలెత్తింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను వివిధ మార్గాల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఇసుక విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. రీచ్‌ల నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకువెళ్లవచ్చునని, ఈ విషయంలో అధికారులెవ్వరూ అడ్డగించవద్దని ఆదేశించారు. ఇసుక ట్రాక్టర్లపై కేసులు పెట్టిన అధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ పార్టీ నేతలు అడ్డగించినా, ఉచిత విధానానికి తూట్లు పొడిచినా మొహమాటం లేకుండ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఆంక్షలు తొలగించటం వల్ల ఇక ఇసుక కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తక్కువ ధరకు ఇసుక లభ్యం

తీర గ్రామాలతో పాటు సమీప గ్రామాలు, పట్టణాల్లో ఇసుక తక్కువ ధరకు లభించనుంది. నిన్నటి వరకు నందిగామ, కంచికచర్లలో ట్రాక్టర్‌ ఇసుక రూ. 3 వేల నుంచి రూ. 3,500 పలికింది. ఒకవైపు ట్రాక్టర్లకు ఉచితం చేయటం, మరోవైపు సీనరేజ్‌, జీఎస్టీ కూడా తీసివేయటం వల్ల నిర్భయంగా ఇసుక తోలుకోవటానికి వీలు పడింది. ఇక నుంచి ట్రాక్టర్‌ ఇసుక వెయ్యి రూపాయలకు లభించనుంది. లారీలకు లోడింగ్‌ విషయమై ఇంతకు ముందున్న పరిమితిని తొలగించారు. 20 టన్నుల నుంచి 30 టన్నుల వరకు లోడింగ్‌కు అనుమతి ఇస్తూనే ఓవర్‌ లోడ్‌ పెనాల్టీ విధించవద్దని సీఎం అధికారులను ఆదేశించటం వల్ల పట్టణాల్లో సైతం ఇసుక ధర భారీగా తగ్గనుంది.

కొందరు నేతల్లో అసహనం

సీఎం తీసుకున్న నిర్ణయంతో కొందరు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో చక్రం తిప్పే నేతలు ఇసుక రాబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రీచ్‌లను, స్టాక్‌ పాయింట్లను గుప్పిట్లో పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగానే రీచ్‌లలో తవ్వకాలు, రవాణా, లోడింగ్‌కు సంబంధించి తక్కువ ధరలకు టెండర్లు వేయించారు. ట్రాక్టర్లకు ఉచితం చేయటంతో రాబడిపై ఆశలు పెట్టుకున్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 01:11 AM