Sarpanch : సర్పంచ్ కనబడుట లేదు..!
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:12 PM
కోళ్లబైలు-2 (వైఎస్సార్ కాలనీ) సర్పంచ్ శశికళ కనపడుట లేదని, పంచాయతీ ప్రజలు ఎంపీడీ ఓకు ఫిర్యాదు చేశారు. ఆమె బెంగళూ రులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అక్కడే నివా సం ఉంటున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమె విదేశీ పర్యటనలో ఉన్నట్లు వారు వివరించారు.
బెంగళూరులో ఉద్యోగం
ప్రస్తుతం హాంగ్‌కాంగ్ పర్యటనలో
బినామి సర్పంచ్‌గా వైసీపీ నేత
అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు
కోళ్లబైలు-2 సర్పంచ్‌కు డీఎల్‌పీఓ నోటీసులు
మదనపల్లె టౌన్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కోళ్లబైలు-2 (వైఎస్సార్ కాలనీ) సర్పంచ్ శశికళ కనపడుట లేదని, పంచాయతీ ప్రజలు ఎంపీడీ ఓకు ఫిర్యాదు చేశారు. ఆమె బెంగళూ రులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అక్కడే నివా సం ఉంటున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమె విదేశీ పర్యటనలో ఉన్నట్లు వారు వివరించారు. ఇక్కడ వైసీపీ నేత బండి మనోహర్ బినామీగా వ్యవహరిస్తున్నాడని, దీనిపై అధికారులు విచారించాలన్న ఫిర్యాదుపై మదన పల్లె డీఎల్‌పీఓ నాగరాజు విచారించి సర్పంచ్ కు నోటీసులు ఇచ్చారు. వివరాల్లోకెళితే...
2021 ఫిబ్రవరిలో కోళ్లబైలు-2 సర్పంచ్‌గా శశి కళ ఎన్నికయ్యారు. వాస్తవంగా ఆమె బెంగళూ రులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్లగా అప్పుడప్పుడూ ఆమె గ్రామ సభల కు వచ్చి వెళ్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే సర్పంచ్ బదులు ఆమె అన్న, వైసీపీ నేత బండి మనోహర్ సర్పంచ్‌గా ఉన్నాడని ప్రజలు ఎంపీడీఓ తాజ్‌మస్రూర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించాలని డీఎల్‌పీఓ నాగ రాజు ఈఓఆర్‌డీ అబ్దుల్ షుకూర్‌కు లేఖ రాశా రు.
ఆదివారం ఈఓఆర్‌డీ కోళ్లబైలు-2కు వెళ్లి సర్పంచ్ శశికళ విషయమై విచారించారు. శశి కళ బెంగళూరులో నివాసం వున్నారని, ఇటీ వలే ఆమె విదేశీ పర్యటన నిమిత్తం హాంగ్‌కాం గ్ వెళ్లారని ఈఓఆర్‌డీకి ప్రజలు వివరించారు. సర్పంచ్ శశికళతో ఈఓఆర్‌డీ ఫోన్‌లో మాట్లాడ గా తాను బయట వున్నానని, ఉన్నఫళంగా రమ్మంటే ఎలా వచ్చేదని సమాధానం ఇచ్చిన ట్లు తెలిసింది. అయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అధికారుల అనుమతిలేకుండా సర్పం చ్ విదేశాలకు వెళ్లరాదు. అంతేకాకుండా ప్రజల కు 15రోజులకు పైగా అందుబాటులో లేకుంటే సర్పంచ్ విధులను ఉపసర్పంచ్‌కు అప్పగించా ల్సి వుంది. కానీ మూడేళ్లుగా ఇక్కడ అవేమీ జరగలేదు. బెంగళూరులో వుంటూ ప్రజలకు అందుబాటులో లేరని ప్రజలు ఈఓఆర్‌డీకి చెప్పారు. దీనిపై ఈఓఆర్‌డీ అబ్దుల్ షుకూర్, కార్యదర్శి గిరిధర్ నాయక్ మంగళవారం ఎంపీ డీఓ తాజ్‌మస్రూర్‌కు విచారణలో తేలిన అంశా లను, పంచాయతీ కార్యదర్శి గిరిధర్‌నాయక్‌తో కలసి వివరించారు.
సర్పంచ్‌కు డీఎల్‌పీఓ నోటీసులు
కోళ్లబైలు-2లో ఈఓఆర్డీ వెళ్లి విచారించారు. ఏవైనా సమస్యలు సర్పంచ్‌కు తెలియచేద్దామం టే ఆమె బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం వున్నట్లు కొత్తగా కార్యదర్శిగా చేరిన గిరిధర్‌నాయక్ అన్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీ సమస్యలను తీర్చే అధికారం, నిధులు డ్రా చేసే అధికారం కేవలం సర్పంచ్‌కు మాత్రమే వుందని, కార్యద ర్శికి లేదని తెలిసింది.
సింగిల్ ఆపరేష న్ మోడ్‌లో సీఎఫ్‌ఎంఎస్ పీడీ అకౌం ట్స్ నిర్వహణ, పీఎఫ్‌ఎంఎస్ 15వ ఫైనాన్స్ నిధులు డ్రా చేసే అధికారం సర్పంచ్‌కు మాత్రమే వున్నట్లు తెలి సింది. పంచాయతీ రికార్డులు, ఎం-బు క్కులు, క్యాష్‌బుక్, ఓచర్లు, రిజల్యూష న్ రిజిస్టర్ అన్నీ సర్పంచ్ అన్న బండి మనోహర్ దగ్గర వున్నట్లు కార్యదర్శి రిపోర్టులో వున్నట్లు తెలిసింది. మరో విశేషమే మంటే పంచాయతీ చెత్త తరలించే ట్రాక్టర్, పారిశుధ్య పరికరాలు కూడా మనోహర్ అధీ నంలోనే వున్నట్లు కార్యదర్శి నివేదికలో పేర్కొన్నారు.
సర్పంచ్ అధికార క్షేత్రం నుంచి 15 రోజులకు మించి గైర్హాజరైతే, విధులు నిర్వహించకుంటే, ఆ సర్పంచ్ అధికారాలు, విధులు, ఉప సర్పంచ్ కు బదలాయించాలి. ఈ వివరాలన్నింటినీ పొం దుపరుస్తూ డీఎల్‌పీఓ 11న సర్పంచ్ శశికళకు సంజాయిషి కోరుతూ లేఖ రాశారు. ఏడు రోజు ల్లో ఈ లేఖకు సంజాయిషి ఇవ్వాలని పేర్కొ న్నారు. అంతేకాకుండా మూడేళ్లలో కోళ్ల బైలు-2 పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన బి.ప్ర శాంతి, బి.రవీంద్రనాయక్, ఎస్.షాబాద్, పి.విజ యకుమారికి డీఎల్‌పీఓ మెమోలు జారీ చేశా రు. వారు విధులు నిర్వహించిన కాలంలో పం చాయతీ రికార్డులు, క్యాష్‌బుక్కులు తదుపరి కార్యదర్శికి అప్పగించిన చార్జిషీట్ వివరాలు మూడు రోజుల్లో డీఎల్‌పీఓ కార్యాలయానికి నివేదించాలని మెమోలో పొందుపరిచారు.
Updated Date - Nov 12 , 2024 | 11:16 PM