భక్తిశ్రద్ధలతో సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవం
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:26 AM
స్థానిక కృష్ణ మందిరంలో సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఉచిత సత్యనారాయణ వత్రాలు నిర్వహించారు.
కదిరి, అక్టోబరు 20 (ఆంరఽధజ్యోతి): స్థానిక కృష్ణ మందిరంలో సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవాన్ని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఉచిత సత్యనారాయణ వత్రాలు నిర్వహించారు. 154 మంది దంపతులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో సత్యసాయి జిల్లాసేవాసమితి అధ్యక్షుడు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర సేవాదల్ జాయింట్ కో-ఆర్డినేటర్ విశ్వ నాథ్‌రెడ్డి, సేవా సమితి సభ్యులు, భజన మండలి కన్వీనర్లు, ఇనచార్జిలు, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 12:26 AM