ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మా బిడ్డను బతికించండి

ABN, Publish Date - Oct 10 , 2024 | 03:11 AM

పేదింటి చిన్నారికి పెద్ద రోగం వచ్చింది.

తలసేమియాతో బాధపడుతున్న చిన్నారి

చికిత్సకు 18 లక్షలు అవసరమన్న వైద్యులు

సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

గార్లదిన్నె(అనంతపురం), అక్టోబరు 9: పేదింటి చిన్నారికి పెద్ద రోగం వచ్చింది. ఆపన్న హస్తం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాతకల్లూరు గ్రామానికి చెందిన సురేం ద్ర, సుజాత దంపతుల కుమారుడు శ్రీకాంత్‌(7) ప్రాణాంతక తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. నెల కిందట జ్వరం రావడంతో పామిడి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వైద్య పరీక్షల అనంతరం శ్రీకాంత్‌కు ఎర్ర రక్తకణాలు క్షీణిస్తున్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఫలితం కనిపించలేదు. మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని హయ్యర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు బెంగుళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి, శ్రీకాంత్‌ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని నిర్ధారించారు. వ్యాధి తీవ్రత పెరుగుతోందని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని, రూ.18 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కూలీపనులు చేసుకునే శ్రీకాంత్‌ తల్లిదండ్రులు అంత సొమ్ము ఎలా తెచ్చేదని అవేదన చెందుతున్నారు. అప్పు తెచ్చిన డబ్బులు అయిపోవడంతో బెంగళూరులోనే దంపతులు కూలిపనులు చేసుకుంటూ కుమారుడి వైద్యం కోసం నానా అగచాట్లు పడుతున్నారు. దాతలు తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. బాధితుల బ్యాంకు ఖాతా వివరాలు: కె.సుజాత, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కల్లూరు బ్రాంచ్‌, అనంతపురం జిల్లా, బ్యాంకు ఖాతా నంబరు 38790106265.

ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0002737

ఫోన్‌ పే నంబర్లు: 9014515056, 8106751483

Updated Date - Oct 10 , 2024 | 03:11 AM