CM Jagan: ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంలో షాక్..
ABN, Publish Date - Jan 05 , 2024 | 01:54 PM
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆర్ 5 జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. అమరావతి ఆర్ 5 జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేసినప్పటికీ తోసిపుచ్చింది. అయినప్పటికీ ధర్మాసనం వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి నివాస గృహాలు నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు అడ్డుకున్నారని సింఘ్వి వాదించారు. రాజధానికి సంబంధించిన ప్రధాన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందని రైతుల తరపు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందిస్తూ.. ఏం జరుగుతుందో తమకు అన్ని తెలుసని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. సింఘ్వి విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు విచారణ ఏప్రిల్‌లో నాన్ మిస్లేనియస్ డే రోజు తుది విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Updated Date - Jan 05 , 2024 | 02:12 PM