ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చట్ట సభలో సిద్ధేశ్వరం

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:19 AM

సిద్ధేశ్వరం అలుగు.. రాయలసీమ వెలుగు అనే నినాదంతో ప్రజా ఉద్యమంగా మారిన నీటిపారుదల సమస్య మీద ఎట్టకేలకు విధాన సభలో సోమవారం వాడివేడి చర్చ జరిగింది.

సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ప్రదేశం

శాసన మండలిలో గళమెత్తిన కర్నూలు, కడప ప్రజాప్రతినిధులు

అలుగుపై పరిశీలించి, చేపడుతాం - మంత్రి నిమ్మల రామానాయుడు

ఇది సాధ్యమే 2011లో ఐదుగురు నిపుణుల కమిటీ నివేదిక

కరువుసీమ నీటి కష్టాలు తీర్చే అలుగు

ఫసిద్ధేశ్వరం సీమ రైతుల సెంటిమెంట్‌

కర్నూలు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): సిద్ధేశ్వరం అలుగు.. రాయలసీమ వెలుగు అనే నినాదంతో ప్రజా ఉద్యమంగా మారిన నీటిపారుదల సమస్య మీద ఎట్టకేలకు విధాన సభలో సోమవారం వాడివేడి చర్చ జరిగింది. కడప జిల్లాకు చెందిన రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ సిద్ధేశ్వరంపై గళమెత్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం సీమ రైతుల సెంటిమెంట్‌.. అలుగు నిర్మాణంతో శ్రీశైలం జలాశయంలో చేరే పూడికకు అడ్డుకట్ట వేయవచ్చు.. తద్వారా ప్రాజెక్టు జీవిత కాలం పెంచడం ద్వారా తెలుగు రాష్ట్రాలకు సాగునీటి, తాగునీటి కష్టాలు తీర్చివచ్చని వీరు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఫైలును చెత్తబట్టలో పడేసింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐదేళ్లలో సిద్ధేశ్వరం అలుగు గురించి మాట్లాడిన పాపాన పోలేదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధేశ్వరంపై చట్టసభలో చర్చ జరగడం ఆశావహ పరిణామం. దీంతో సీమ ప్రజల ఆకాంక్షగా, సెంటిమెంట్‌గా మారిన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించవచ్చు. ఈ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 311 టీఎంసీలు. పూడిక చేరడంతో 215 టీఎంసీలకు పడిపోయింది. తాజాగా అంచనా వేస్తే 180 టీఎంసీలకు చేరుతుందని రాయలసీమ సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఏటా 2.5 టీఎంసీల పూడిక జలాశయంలో చేరుతుందని అంచనా. అదే క్రమంలో శ్రీశైలం ఎగువన 1985లో తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 21,500 క్యూసెక్కుల ప్రవాహంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మించారు. 2004లో అఽంధకారం చేపట్టిన నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే తెలుగుగంగ కాలువ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎనఎస్‌ఎస్‌) ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు (హెచఎనఎస్‌ఎస్‌)లు నిర్మించారు. కేసీ కాలువ కూడా సాగునీరు అందించేలా ముచ్చుమరి లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాజెక్టులకు శ్రీశైలం ఎగువ నుంచే కృష్ణా వరద జలాలు మళ్లించాల్సి ఉంది. ఏటేటా పూడిక చేరడం, 854 అడుగుల దిగువకు డ్యాం నీటి మట్టం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా జలాలు సీమ రైతులకు అందని ద్రాక్షే అవుతున్నది. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం సంగమేశ్వరం చెంతన రెండు కొండల మధ్యలో ‘సిద్ధేశ్వరం అలుగు’ నిర్మాణమేనని ఏనాడో సాగునీటి నిపుణులు తేల్చారు. ఈ అలుగు సాధన కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి సహా వివిధ రాయలసీమ సంస్థలు పోరాటం చేస్తున్నాయి. 2016 మే 31న వేలాది మంది రైతులు సిద్ధేశ్వరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆనాడు టీడీపీ అధికారంలో ఉంటే.. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అధికారం చేపట్టాక ఐదేళ్లు సిద్ధేశ్వరం అలుగు ఊసే ఎత్తలేదు. తాజాగా టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ .. ఆ పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, మంత్రి ఎనఎండీ ఫరూక్‌ మండలిలో సిద్ధేశ్వరం గళం వినిపించారు.

ఫ 2011లోనే నిపుణుల కమిటీ ఆమోదం:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం సాధ్యాసాఽధ్యాలపై అధ్యయనం కోసం 2011 మార్చి 11న అప్పటి ఇంజనీర్‌-ఇన-చీఫ్‌ (ఏడబ్ల్యూ) ఎంకే రెహమన చైర్మన/కన్వీనర్‌గా ఐదుగురు ఇంజనీరింగ్‌ నిపుణులతో కమిటీ వేశారు. ఈ కమిటీలో మీడియం ఇరిగేషన ఈఎనసీ పీఎస్‌ఆర్‌ సుబ్రమణ్యం, ఇరిగేషన ఈఎనసీ సి. మురళీధర్‌, డబ్ల్యూబీపీ డైరెక్టర్‌ ఎం. సాంబమూర్తి, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ కె. జలంధర్‌ సభ్యులుగా ఉన్నారు. అధ్యయనం తరువాత ఈ కమిటీ 2011 ఆగస్టు 19న ఆ కమిటీ సమావేశమై కీలక అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. శ్రీశైలం ఎగువన కృష్ణా నదిపై రాయలసీమ కరువు పీడిత జిల్లాలకు సాగు, తాగునీరు అందించే 8 ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం నుంచి విద్యుత ఉత్పత్తి పేరిట నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం నీటి మట్టం 854 అడుగులకు తగ్గిపోతే సీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి ఉంది. అదే జరిగితే కరువుసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందడం కష్టం అవుతున్నది. దీంతో రాయలసీమ కరువు ప్రాంతంలో తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం అవసరం ఉందని నిపుణుల కమిటీ నిగ్గుతేల్చింది. నాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అదే క్రమంలో 854 అడుగుల నీటి మట్టంలో అలుగు నిర్మిస్తే.. శ్రీశైలంలో ఏటా చేరే 2.5 టీఎంసీ పూడికను సంగమేశ్వరం వెనుకాలే ఆపేసి డ్యాం జీవితకాలం పెంచవచ్చు.. అధిక వరదలు వస్తే పోతిరెడ్డిపాడు నుంచి వరదను మళ్లించి డ్యాంకు రక్షణ కల్పించవ్చని సీమ సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు రెండూ పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో ఆ రెండు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విడత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో విధాన సభ వేదికగా సిద్ధేశ్వరం ఆ పార్టీ ఎమ్మెల్సీలే చర్చనీయాంశం చేయడం స్వాగతించాల్సిన పరిణామం.

ఫ సిద్ధేశ్వరంపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు:

రాయలసీమ సెంటీమెంట్‌గా మారిన సిద్ధేశ్వరం అలుగు నిర్మించాల్సిందే అని కడప జిల్లాకు చెందిన రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ గళమెత్తారు. ఈ ప్రాజెక్టు సాఽధ్యాసాధ్యాలు, ఆంధ్రప్రదేశ మొత్తానికి ఏ విధరంగా ప్రయోజనమో ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అంకెలతో సహా వివరించారు. అలుగుపై ప్రజల్లో ఆకాంక్ష బలంగా ఉంది.. రైతుల ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు... ప్రభుత్వం తప్పక చేపట్టాలని మంత్రి ఫరూక్‌ మండలిలో వాయిస్‌ వినిపించారు.

ఫ పరిశీలించి చేపడుతాం

ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, మంత్రి ఫరూక్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇస్తూ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వల్ల అదనపు నీటి సామర్థ్యం ఉంటే తప్పకుండా పరిశీలించి చేపడుతామని వివరించారు. 2013 జూన 26న ఆప్పటి ప్రభుత్వం 2120 మెమో ఇచ్చింది. శ్రీశైలం ఫోర్‌షోర్‌ ఏరియాలో మరో డ్యాం నిర్మాణం వల్ల అదనంగా నీటి నిల్వ ఉండదని, ఆ ప్రాజెక్టు అవసరం లేదని తేల్చిచెప్పారు. 2016-17లో మళ్లీ సిద్ధేశ్వరం ప్రతిపాదన వచ్చింది. అంతర్‌ రాష్ట్ర సమస్య ఉందని, దీని వల్ల ప్రయోజనం లేదని 2018 సెప్టెంబరు 12న ఆనాటి ఈఎనసీ కూడా లేఖ ఇచ్చారని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాంతానికి నీటి ఇచ్చే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే హంద్రీనీవాకు రూ.2,500 కోట్లు కేటాయించి విస్తరణ చేపట్టబోతున్నామని తెలిపారు. సిద్ధేశ్వరంపై కూడా అధ్యయనం చేసి అదనపు నీటి నిల్వకు అవకాశం ఉంటే .. రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉందంటే తప్పక చేపడుతామని మంత్రి అన్నారు.

ఫ మంత్రి నిమ్మల డొంకుతిరుగుడు సమాధానం - బొజ్జ దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు:

సిద్ధేశ్వరంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం డొంకతిరుగుడుగా ఉంది. 2011లోనే ఐదుగురు నిపుణుల కమిటీ సిద్ధేశ్వరం నిర్మాణం అవసరం ఉందని నివేదిక ఇచ్చింది. ఏటా 2.50 టీఎంసీలు పూడిక శ్రీశైలంలో చేరుతున్నది. ఇప్పటికే 311 టీఎంసీలు నుంచి 215 టీఎంసీలకు తగ్గింది. తాజాగా అంచనా వేస్తే 180 టీఎంసీలు కూడా ఉండదు. అంటే దాదాపు 100 టీఎంసీలు సామర్థ్యం కోల్పోయాం. సిద్ధేశ్వరం అలుగు ద్వారా పూడికకు కట్టడి చేసి శ్రీశైలం డ్యాం జీవిత కాలం పెంచవచ్చు. అదనపు సామర్థ్యం ఉండదని ప్రతిపాదన తుంగలో కలిపే ప్రయత్నం చేయకూడదు.

===========

Updated Date - Nov 19 , 2024 | 12:19 AM