సైలెంట్ కిల్లర్
ABN, Publish Date - Nov 13 , 2024 | 11:34 PM
చెక్కెర వ్యాధి ఆరోగ్యాన్ని మెల్లగా ధ్వంసం చేస్తుంది. అనేక ఇతర వ్యాధులు తీవ్రమయ్యేలా చేస్తుంది.
చక్కెర వ్యాధి ప్రాణాంతకం
ఏటా పెరుగుతున్న మధుమేహ బాధితులు
పట్టణాల్లో 50 శాతం
నేడు వరల్డ్ డయాబెటిక్ డే
కర్నూలు హాస్పిటల్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): చెక్కెర వ్యాధి ఆరోగ్యాన్ని మెల్లగా ధ్వంసం చేస్తుంది. అనేక ఇతర వ్యాధులు తీవ్రమయ్యేలా చేస్తుంది. ఒకప్పుడు 50 ఏళ్ల తర్వాత వచ్చే మధుమేహం ఇప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల 20 నుంచి 30 ఏళ్ల వాళ్లకు కూడా వస్తుంది. మధుమేహంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 2006 నుంచి వరల్డ్ డయాబెటిక్ డేను నిర్వహిస్తోంది. 1972లో సర్ ప్రెడరిక్ బాంటింగ్ ఇన్యూలిన కనిపెట్టడంతో ఆయన పుట్టిన రోజు నవంబరు 14న వరల్డ్ డయాబెటిక్ డేగా జరుపుకుంటున్నారు.
డయాబెటిక్ వ్యాధి ఇటీవల చాలా తీవ్రమైంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో అధికంగా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. పట్టణాల్లో 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 శాతంగా కనిపిస్తున్నది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజీ ఓపీ వారంలో మంగళ, శుక్రవారాల్లో ఉంటుంది. ప్రతి వారం 700 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. ఇందులో టైప్-1 బాధితులు, చిన్నారులు 100 మంది ఉండగా.. మిగిలిన రోగులు 600 మంది టైప్-2 ఉన్నారు. ఇందులో టైప్-1 బాధితులకు ఎండోక్రైనాలజీ విభాగం నెలకు ప్రతి రోగికి రెండు వైల్స్ ఇవ్వగా.. టైప్-2 రోగులకు మందులను ఉచితంగా అందిస్తున్నది. 20 పడకల సామర్థ్యం ఉన్న ఎండోక్రైనాలజీ విభాగం ప్రతి వారం 10 నుంచి 15 మంది అడ్మిషన పొందుతుంటారు.
షుగర్ స్థాయి ఎలా ఉండాలంటే:
ఫ మన శరీరంలో చక్కెర స్థాయి పడగడుపున తినక ముందు 100 కన్నా తక్కువ ఉంటే మధుమేహం లేనట్లుగా భావించాలి. 126 పైన ఉంటే షుగర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించి వైద్యులను సంప్రదించాలి.
ఫ తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయిలు 140లోపు ఉంటే నార్మల్. 140 నుంచి 199 చక్కెర స్థాయి ఉంటే ప్రి డయాబెటిక్ ఉన్నట్లు భావించి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫ తిన్న తర్వాత చక్కెరస్థాయి 200 దాటితే షుగర్ ఉన్నట్లుగా చెప్పవచ్చు.
ఫ మూడు నెలల చక్కెర స్థాయి 7 శాతం కంటే తక్కువ ఉండేలా చూడాలి. 5.6 నుంచి 6.4 శాతం ఉంటే ప్రిడయాబెటిక్, 6.5 శాతం ఉంటే షుగర్ ఉన్నట్లు చెప్పవచ్చు.
ఫ తెల్ల అన్నం మహా ప్రమాదం: చెక్కెర వ్యాధిగ్రస్థులు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వరి అన్నం తింటే చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. బ్రౌన రైస్, చిరుధాన్యాలు తినాలి. డయాబెటిక్ ఉన్న రోగులు సీతాఫలం, మామిడి, సపోట పండ్లల ు తినకూడదు. ఆపిల్, బొప్పాయ, దానిమ్మ, చీని పండ్లను తినవచ్చునన్నారు.
ఫ జిల్లాలో 1.44 లక్షల రోగులు: వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఎనసీడీ సర్వేలో జిల్లాలో 1.44 లక్షల మంది మధుమేహ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఎనసీడీ ఇంటింటి సర్వేలో రోగులను గుర్తించారు.
ఫ నేడు నర్సులకు అవగాహన సదస్సు - డా.పి. శ్రీనివాసులు, ప్రొఫెసర్ అండ్ హెచవోడీ, ఎండోక్రైనాలజీ విభాగం, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి
వరల్డ్ డయాబెటిక్ డేను పురస్కరించుకుని కర్నూలు జీజీహెచ ఎండోక్రైనాలజీ విభాగం హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులకు అవగాహన సదస్సును గురువారం ఉదయం ఓల్డ్ సీఎల్‌జీలో ఏర్పాటు చేశాం. రోగికి చికిత్స అందించడంలో వైద్యుల తర్వాత ఆ స్థానం నర్సులదే. అందుకే షుగర్ రోగులకు ఇన్సూలిన ఎంత మోతాదులో ఇవ్వాలి.. మందులు ఎలా ఇవ్వాలి.. అనే చికిత్స విధానాలను వివరించనున్నాం.
ఫ చివరి దశలో వస్తున్నారు - డా. మీనుగ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన, కర్నూలు జీజీహెచ:
చాలా మంది షుగర్ వ్యాధితో కిడ్నీలు డ్యామేజ్ అయ్యాక, నరాల బలహీనత, పక్షవాతం, గుండె జబ్బులకు గురయ్యాక వస్తుంటారు. మధుమేహం ఉన్న వారు ప్రతి నెల పరీక్షలు చేయించుకోవాలి. శరీరంలోని షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి.
ఫ షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి - డా.బి. భరత, ఎండోక్రైనాలజిస్టు, కర్నూలు
శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు సక్రమంగా వాడాలి. కనీసం మూడు నెలలకు ఒకసారి వైద్యులను సంప్రదించాలి. చాలా మంది ఒకసారి పరీక్షలు చేయించుకుని ఏళ్ల తరబడి అవే మందులు వాడుతుంటారు. అలా చేస్తే వ్యాధి అదుపులో ఉండదు.
Updated Date - Nov 13 , 2024 | 11:34 PM