శాస్త్రోక్తంగా మహాగణపతి హోమం
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:52 PM
పెద్దతామరాపల్లి దత్తవేదిక ఆవరణలో వినాయక నవరాత్రి ఉత్స వాల సందర్భంగా ఆదివారం మహాగణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నందిగాం: పెద్దతామరాపల్లి దత్తవేదిక ఆవరణలో వినాయక నవరాత్రి ఉత్స వాల సందర్భంగా ఆదివారం మహాగణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దత్త బృందం ఆధ్వర్యంలో పురోహితులు మావడి శ్రీనివాస్‌శర్మ, సింహాచలం శర్మ లతో పాటు 8 మంది రుత్వికుల వేదమంత్రాల నడుమ పలువురు దంపతులు హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేప ట్టారు. అలాగే పలు గ్రామాల్లో గణనాథుని నిమజ్జనోత్సవాలు యువత ఆనందో త్సాహాల నడుమ నిర్వహించారు.
రావివలసలో గణపతి లడ్డూ రూ.లక్ష
టెక్కలి: రావివలసలో గణనాథుని లడ్డూ ఆది వారం రాత్రి వేలంపాట నిర్వ హించగా గ్రామానికి చెందిన బడే వరాహ శంకరరావు రూ.లక్ష కు సొంతం చేసు కున్నారు. ఈ సంద ర్భంగా ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు. లింగాలవలసలో చిన్నారుల కోలాటం ప్రదర్శన, యువత సందడితో గణేశ్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. డీజే సౌండ్లు లేకుండా భక్తి పారవశ్యంతో కోలాటానికి ప్రాధాన్యం ఇవ్వడంతో గ్రామ స్థులు ఆనందం వ్యక్తంచేశారు. అంతకుముందు నిర్వహించిన లడ్డూ వేలం పాటలో గ్రామానికి చెందిన సీమలవలస చిన్నవాడు రూ.46 వేలకు, స్వామివారి కండువాను లాభాల రుక్మాంగధరావు రూ.25 వేలకు దక్కించుకున్నారు.
అవలింగిలో రూ.51 వేలు..
జలుమూరు (సారవకోట): అవలింగి గ్రామంలో శ్రీ విజయ గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం లడ్డూ వేలం వేశా రు. గ్రామస్థుడు వారణాసి శ్రీనివాసరావు రూ.50,116లకు లడ్డూను కైవసం చేసు కున్నారు. అర్చకులు మావుడూరు జానీప్రసాద్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.
బెండిలో రూ.46 వేలు..
వజ్రపుకొత్తూరు: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెండి గ్రామంలో శనివారం రాత్రి లడ్డూ వేలం నిర్వహించారు. గ్రామస్థుడు దాసరి గున్నయ్య రూ.46 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
మూలపేటలో రూ.32 వేలు
సంతబొమ్మాళి: మూలపేట గ్రామంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఉత్సవాల్లో భాగంగా లడ్డూ రూ.32 వేలకు గ్రామస్థుడు జీరు గజేంద్ర దక్కించుకున్నారు. మండలంలోని నౌపడలో వినాయక నవరాత్రుల సందర్భంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా గణపతికి ప్రత్యేక పూజలు
ఎల్.ఎన్.పేట: చిన్నకొల్లివలస ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ఆదివారం పురోహితుడు భాస్క రభట్ల సాయినిఖిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
పలు గ్రామాల్లో గణేశుని నిమజ్జనం
నరసన్నపేట: వినాయక నవరాత్రుల సందర్భం గా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తులను ఆదివారం ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేప ట్టారు. నాయుడు వీధిలో నారాయణ సేవ చేశారు. జమ్ము, కంబకాయి, మాకి వలస, ఉర్లాం, నడగాం, బొరిగి వలస తో పాటు పట్టణంలో గణనాథుని నిమజ్జనం చేపట్టారు.
ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
వెదుళ్లవలస (పోలాకి): వెదుళ్ల వలస గ్రామంలో ఏర్పాటు చేసిన గణ నాథుని మండపం వద్ద ఆదివారం రాజా రాంపురం గ్రామానికి చెందిన విద్యార్థినులు చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. పోలాకి, అంపలాం, పిన్నింటిపేట, వెదుళ్లవలస, అంబీరుపేట, గాతలవలస, దువ్వవలస, దీర్గాశి, ఈదులవలస సుసరాంకాలనీల్లో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్న వితరణ చేపట్టారు. మబగాంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన గణ నాథులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
చెస్ పోటీ విజేతలకు బహుమతి ప్రదానం
టెక్కలి: తేలినీలాపురంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఓపెన్ చెస్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో కె.కల్పక్ (పలాస) ప్రథమ, జయరాజ్ (శ్రీకాకుళం) ద్వితీయ, వెంకటేష్ తృతీయ స్థానం సాధించారు. అలాగే అండర్-7 విభాగంలో కె..లిపిక ప్రథమ, ఎస్.రిత్విక్ ద్వితీయ స్థానాలు, అండర్- 9 విభాగంలో జైచరణ్ వీర్ ప్రథమ, పార్థివ్ ద్వితీయ స్థానం సాధించారు. బాలికల విభాగంలో స్పూర్తి ప్రథమ, దీపిక ద్వితీయ స్థానం పొందారు. వీరికి చెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్వి సనపల భీమారావు, కమిటీ సభ్యులు వెంకటరమణమూర్తి, తవిటినాయుడు, సంతోష్, కృష్ణారావు, అనీల్‌రాజ్, వసంత్ నగదు బహుమతులను అందజేశారు.
Updated Date - Sep 15 , 2024 | 11:52 PM