అద్దెకు కార్యకర్తలు
ABN, Publish Date - Apr 29 , 2024 | 11:56 PM
అద్దెకు కార్యకర్తలు దొరుకుతారన్న మాట వినడానికి ఆసక్తిగా ఉన్నా వాస్తవమే. గతంలో రాజకీయపార్టీల నాయకులు స్వచ్ఛందంగా పిలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చే వారు. ప్రస్తుతం ప్రజల ఆలోచన ధోరణి, వ్యవహార శైలి మారింది. ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. దీంతో రాజకీయ పార్టీల ప్రచారానికి డబ్బులు ఇవ్వనిదే ముందుకురావడం లేదు. జిల్లాలో ఇటీవల కాలంలో ఓ ప్రాంతంలో రెండు ప్రధాన పార్టీలు నిర్వహించిన ర్యాలీలు, సభలకు వచ్చిన వారే మళ్లీ రావడం విశేషం. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమకు ఓటు వేస్తారోలేదనని సందేహం వ్యక్తంచేస్తున్నారు.
(మెళియాపుట్టి)

గత్యంతరం లేక...
జనసమీకరణలో విఫలమైతే ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తాయని భావించి ఆయా పార్టీలు జిల్లా నాయకులు గ్రామస్థాయి నాయకులపై టార్గెట్లు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం పుణ్యమాని ఎవరూ ఖాళీగా ఉండడంలేదు. దీంతో సభలకు వెళ్తే తమ ఆదాయానికి గండిపడు తుందని పార్టీల ప్రతినిధులకు స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో గత్యంతరం లేక అద్దె కార్యకర్తలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల సీఎం జగన్ టెక్కలిలో నిర్వహించిన సిద్ధం సభతో పాటు అధికార పార్టీనాయకులు నామినేషన్ ర్యాలీకి సైతం అద్దె కార్యకర్తలను సేకరించి తీసుకువెళ్లడం విశేషం. ఇటీవల పాతపట్నంలో అధికార పార్టీ అభ్యర్థి నామినేషన్‌కు పాలకొండ నియో జకవర్గం పరిధి నుంచి పురుషులకు రూ.600, మహిళలకు రూ.400 ఇచ్చి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత మంది అభ్యర్థులు డబ్బులతో పాటు ఆటోలు అద్దెకు రూ.1000 ఇస్తున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ఒక్కో అభ్యర్థికి రూ. రెండు కోట్లపైనే ఖర్చయినట్లు బహిరంగానే ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఉపాధి పనులకు ఉదయం పూట వెళ్లి, తర్వాత సభలకు వెళ్లి, సాయంత్రం మళ్లీ పనులకు హాజరుకావుతున్నారు. ప్రస్తుతం అద్దె కార్యకర్తలకు భలే గిరాకీ ఉంది.
Updated Date - Apr 29 , 2024 | 11:56 PM