ఫిర్యాదులను పరిష్కరించండి: ఎస్పీ
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:15 AM
: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు లను పెండింగ్ లేకుండా చట్టప్రకారం పూర్తిస్థాయిలోపరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదే శించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో ఆయన జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 50 వినతులను స్వీకరించారు.
అరసవల్లి, డిసెంబరు 2(ఆంధ్రజ్యో తి): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు లను పెండింగ్ లేకుండా చట్టప్రకారం పూర్తిస్థాయిలోపరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదే శించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో ఆయన జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 50 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరగా చర్యలు చేపట్టి సకాలంలో అర్జీ లను పరిష్కరించాలని కోరారు.ఫిర్యాదు లపై సంబంధిత పోలీసు అదికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి బాధితు లకు సత్వర న్యాయంచేయాలని ఆదేశించారు.ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని అధికారులను ఆదేశించా రు.ఈసందర్భంగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగావెళ్లి వారి సమస్య లను తెలుసుకుని, పరిష్కరిస్తామని భరోసాఇచ్చారు.
Updated Date - Dec 03 , 2024 | 12:15 AM