ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలుషిత ఆహారం తిని..

ABN, Publish Date - Jul 06 , 2024 | 11:25 PM

కోటబొమ్మాళిలోని కేజీబీవీ విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ కేజీబీవీలో 280 మంది విద్యార్థినులు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం భోజనం చేసి.. నీరు తాగిన కాసేపటి తర్వాత 20 మంది కడుపునొప్పితో బాధపడ్డారు.

సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

- 20 మంది కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత

టెక్కలి, జూలై 6: కోటబొమ్మాళిలోని కేజీబీవీ విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ కేజీబీవీలో 280 మంది విద్యార్థినులు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం భోజనం చేసి.. నీరు తాగిన కాసేపటి తర్వాత 20 మంది కడుపునొప్పితో బాధపడ్డారు. వాంతులు, విరోచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రిన్సిపాల్‌ ప్రసన్నలక్ష్మి స్పందించి అనారోగ్యానికి గురైన సోనియా, శరణ్య, త్రిష, మేఘన, జ్యోషిత, జగది, ఉమ, బాషిత, ప్రియ తదితర విద్యార్థినులను కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు తరలించారు. వైద్యం చేయడంతో వారంతా కోలుకుంటున్నారు. జీసీడీవో ఎన్‌.నీరజ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు. ఇదే పాఠశాలలో తిలారు పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ మనీష రెండు రోజులుగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. కలుషిత ఆహారం, నీరు కారణంగానే అస్వస్థతకు గురయ్యారని పీహెచ్‌సీ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. సమాచారం తెలుసుకుని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, తాగునీరు అందజేయాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 06 , 2024 | 11:25 PM

Advertising
Advertising
<