ఏపీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:07 AM
ఏపీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్‌లో పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీకాకుళం) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, హెల్ప్‌లైన్ సెంటర్ కోఆర్డినేటర్ జి.దామోదరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎచ్చెర్ల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్‌లో పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీకాకుళం) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, హెల్ప్‌లైన్ సెంటర్ కోఆర్డినేటర్ జి.దామోదరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీ-ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమై వచ్చే నెల 14 వరకు కొనసాగుతుంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 5వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ప్రొసెసింగ్ ఫీజు చెల్లింపు, వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్ల పరిశీలన చేయించాలి. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే హెల్ప్‌లైన్ కేంద్రాన్ని వచ్చే 2 నుంచి 6లోగా సంప్రదించాలి. వచ్చే నెల 3 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జరుగుతుంది. 8న వెబ్‌ఆప్షన్ల నమోదులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. వచ్చే నెల 11న సీట్ల కేటాయింపు వివరాలు ప్రకటిస్తారు. 11 నుంచి 14వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ కావాలి’ అని దామోదరరావు సూచించారు.
Updated Date - Nov 30 , 2024 | 12:07 AM