బెల్ట్‌షాపులు నిర్వహిస్తే పీడీయాక్ట్ ప్రయోగించండి
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:56 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మద్యం నిర్వహ ణ నూతన పాలసీకి తూట్లు పొడిచేలా బెల్ట్‌షా పులు నిర్వహిస్తే పీడీయాక్ట్ ప్రయోగించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులు ఆదేశించారు.
ఆమదాలవలస (బూర్జ), డిసెంబరు 1(ఆం ధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మద్యం నిర్వహ ణ నూతన పాలసీకి తూట్లు పొడిచేలా బెల్ట్‌షా పులు నిర్వహిస్తే పీడీయాక్ట్ ప్రయోగించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులు ఆదేశించారు. ఆదివారం బూర్జ మండల పరి షత్ కార్యాలయంలో ఎంపీపీ కర్నేన దీప అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో తిరుపతిరావు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తుండగా.. పలువురు సభ్యులు సహకార అవినీతి, ధాన్యం కొనుగోలు విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో సహకార సంఘంపై సమగ్ర వి చారణ జరిపించేలా తక్షణమే చర్యలు చేపట్టా లని అధికారులు ఆదేశించారు. ఖరీఫ్ సాగు చేసే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఫెంగల్ తుఫాన్ నష్టం నుంచి రైతులను ఆదుకోవడా నికి చర్యలు తీసుకోవాలని అధికారురులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయించాల న్నారు. మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణం నాయుడు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 11:56 PM