మెగా పేరంట్, టీచర్ల సమావేశాలకు ఏర్పాట్లు
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:20 AM
స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించనున్న మెగా పేరంట్స్ వేడుకులకు కలెక్టర్ హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం డిప్యూటీ డీఈవో విజయకుమారి, ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పి.దాలినాయుడులు పరిశీలించారు.
నరసన్నపేట, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించనున్న మెగా పేరంట్స్ వేడుకులకు కలెక్టర్ హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం డిప్యూటీ డీఈవో విజయకుమారి, ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పి.దాలినాయుడులు పరిశీలించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ డేకి సుమారు 600 మంది విద్యార్థుల తల్లి దండ్రులు, మరో 200 మంది అతిథులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. పాఠశాల మైదానంలో తల్లలకు ఆటల పోటీలు నిర్వహణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉర్లాం, సత్యవరం, బాడాం, మడపాం, లుకలాం, సుందరాపురం తదితర పాఠశాలలను మండల విద్యాశాఖాధికారులు పరిశీలించారు.
95 పాఠశాలల్లో..
పోలాకి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక కలుపుకుని మొత్తం 95 పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఎంఈ వో శ్రీనివాసనాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పోలాకి, కోడూరు ఉన్నత పాఠశాలల్లో పెద్దఎత్తున సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చి నందున ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఈదులవలస మోడల్ స్కూల్‌లో విద్యాకమిటీ సభ్యులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ పైడి ప్రవీణ వివిధ అంశా లపై చర్చించారు.
మెగా పీటీఎంకు ఏర్పాట్లు
నందిగాం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని పాఠశాలల్లో శనివారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్‌ఎంల నేతృత్వంలో ప్రభు త్వ సూచనల మేరకు పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు రానున్నందున పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై ఎంపీడీవో టి.రాజారావు, ఎంఈవో జి.నర్శింహులు శుక్రవారం పరిశీలించారు.
పండగ వాతావరణంలో పీటీఎంలు
పాతపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పేరెంట్, టీచ ర్ల సమావేశాలు పండగ వా తావరణంలో నిర్వహించా లని జిల్లా నోడల్ అధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ గౌరీశంకర్ అన్నారు. స్థానిక ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను శుక్రవారం పరిశీ లించారు. కొరసవాడ జడ్పీ హైస్కూల్‌ను మండల ప్రత్యే కాధికారి మంచు కరుణాకర రావు సందర్శించి తీసుకోవాల్సి న జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి. చంద్రకుమారి, హెచ్‌ఎంలు ఎస్.వైకుంఠరావు, బి.సింహా చలం పాల్గొన్నారు.
Updated Date - Dec 07 , 2024 | 12:20 AM