ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైనిక శిక్షకుడి అరెస్టు

ABN, Publish Date - Dec 08 , 2024 | 12:18 AM

ఆర్మీలో చేరేందుకుగానూ యువతకు శిక్షణ పేరిట.. వారిపై దాడికి పాల్పడిన ఆర్మీకాలింగ్‌ సంస్థ నిర్వాహకుడు, శిక్షక్షుడు బీవీ రమణపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద

- ఏడు రోజుల రిమాండ్‌

- డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఆర్మీలో చేరేందుకుగానూ యువతకు శిక్షణ పేరిట.. వారిపై దాడికి పాల్పడిన ఆర్మీకాలింగ్‌ సంస్థ నిర్వాహకుడు, శిక్షక్షుడు బీవీ రమణపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తెలిపారు. శనివారం శ్రీకాకుళంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ వివేకానంద మాట్లాడారు. ‘శ్రీకాకుళం మిల్లు జంక్షన్‌ సమీపంలో ఉన్న ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ సంస్థలో శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థిని.. ఆ సంస్థ నిర్వాహకుడు బి.వి.రమణ ఏడాది కిందట అతి క్రూరంగా చితకబాదాడు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై సీఐ కె.పైడపునాయుడు, వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఎం.హరికృష్ణతో విచారణ చేపట్టాం. ఇచ్ఛాపురానికి చెందిన ఓ విద్యార్థి తప్పు చేశాడన్న కోపంతో.. అతడిపై కంప్యూటర్‌ వైర్‌తో దాడి చేసినట్లు గుర్తించాం. ఆ విద్యార్థి తన తండ్రి సమక్షంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సంస్థ నిర్వాహకుడు బి.వి.రమణను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచాం. బెంచ్‌ కోర్టు న్యాయమూర్తి ఏడు రోజులపాటు రిమాండ్‌ విధించారు. దీంతో రమణను జైలుకి తరలించామ’ని డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ సంస్థలో చదువుతున్న విద్యార్థులు.. వేరే కళాశాల గుర్తింపుపై చదువుతున్నారన్నారు. ఇంతకాలం గుర్తింపు లేకుండానే సంస్థను రమణ నడిపినట్లు విచారణలో గుర్తించామని తెలిపారు. దీనిపై డీఈవోకి లేఖ రాసామన్నారు. అలాగే ఆర్మీ లోగోలు కూడా వినియోగించడంపై ఆరా తీయాలని సంబంధిత ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినా, లేదా ఇతర కారణాల వల్ల ఎవరైనా నష్టపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో శ్రీకాకుళం సీఐ కె.పైడపునాయుడు, వన్‌టౌన్‌ ఎస్సై ఎం.హరికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:18 AM