Atchannaidu: వైసీపీ సర్కారును పెకలించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: అచ్చెన్న
ABN, Publish Date - Jan 26 , 2024 | 12:05 PM
అమరావతి: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
అమరావతి: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం మంచిగా ఉన్నప్పటికీ పాలించేవాడు దుర్మార్గుడైతే ప్రజలకు నష్టమే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అయ్యే పరిస్థితి లేదని, అంబేద్కర్ రాజ్యాంగం కావాలంటే దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే సాధ్యమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు.
జగన్ రెడ్డి.. ఎన్నికలు జరిగిన తర్వాత పారిపోయేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటూ.. మరో వైపు ఎన్నికలు సిద్ధం పేరుతో ప్రచార సభలు నిర్వహించటం హాస్వాస్పదంగా ఉందన్నారు. జగన్ తన ప్రచార సభలకు సిద్ధం పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలని సూచించారు. వైసీపీ సర్కారును పెకలించేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 5 ఏళ్ల అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గాలు భరించేలేక ఆ పార్టీ నేతల్ని ప్రజలు తన్ని తరిమేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన జగన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Updated Date - Jan 26 , 2024 | 12:12 PM