ఎయిడ్స్ నివారణపై అవగాహన తప్పనిసరి
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:58 PM
ఎయి డ్స్ నివారణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు.
- డీఎంహెచ్‌వో మీనాక్షి
అరసవల్లి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎయి డ్స్ నివారణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఆదివారం డీఎం హెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మీనాక్షి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ సోకినవారు క్రమం తప్పకుండా మందులు వా డాలని, ప్రోటీన్స్‌తో కూడిన ఆహారం తీసుకో వాలని తెలిపారు. అనంతరం ర్యాలీలో పాల్గొ న్నవారితో ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మో హనరావు, సంఘ సేవకులు మంత్రి వెంకట స్వామి, బెజ్జిపురం యూత్‌క్లబ్ అధ్యక్షుడు ప్రసాదరావు, ఎన్‌సీసీ కోఆర్డినేటర్ పోలినా యుడు, కాలేజి విద్యార్థులు, యువత, నర్సింగ రావు, చిన్మయిరావు, గొలివి రమణ, సతీష్, సుజాత ఉమాశంకర్, రెడ్‌క్రాస్, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 11:58 PM