ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సివిల్స్‌లో బాన్న వెంకటేష్‌ సత్తా

ABN, Publish Date - Apr 16 , 2024 | 11:54 PM

జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్‌ సివిల్స్‌ ఫలితాల్లో సత్తాచాటారు. ఐఏఎస్‌ లక్ష్యంతో కష్టపడి చదివి రెండో ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 467వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు.

వెంకటేష్‌కు స్వీటు తినిపిస్తున్న తల్లిదండ్రులు రోహిణి, చంద్రరావు

- జాతీయస్థాయిలో 467వ ర్యాంకు

జలుమూరు, ఏప్రిల్‌ 16: జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్‌ సివిల్స్‌ ఫలితాల్లో సత్తాచాటారు. ఐఏఎస్‌ లక్ష్యంతో కష్టపడి చదివి రెండో ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 467వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్‌ తండ్రి చంద్రరావు ధాన్యం వ్యాపారి. తల్లి రోహిణి గృహిణి. వెంకటేష్‌ ప్రాథమిక విద్యాభ్యాసం మారుమూల గ్రామమైన అల్లాడపేటలోనే సాగింది. మునసబుపేటలోని ప్రైవేటు స్కూల్‌లో పదోతరగతి వరకు చదివారు. విశాఖ శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. అనంతరం 2019లో తమిళనాడు తిరుచనాపల్లిలో ఎన్‌ఐటీ పూర్తిచేసి.. రెండేళ్లు తమిళనాడులోని కోల్‌కం కంపెనీలో పనిచేశారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలో గురి తప్పగా.. రెండో ప్రయత్నంలో 467వ ర్యాంకు సాధించి జిల్లాకు వన్నె తెచ్చారు. ఐఏఎస్‌ సాధించడమే తన లక్ష్యమని వెంకటేష్‌ తెలిపారు. వెంకటేష్‌కు జాతీయస్థాయిలో ర్యాంకు రావడంతో గ్రామస్థులు ఆయనను అభినందిస్తున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:54 PM

Advertising
Advertising