పూలదండకూ నోచుకోని బుద్ధుడు
ABN, Publish Date - May 24 , 2024 | 11:49 PM
ప్రపంచ దేశాల్లో గురువారం బుద్ధపౌర్ణమి సందర్భంగా బుద్ధుడి జయంతి వేడుక లు ఘనంగా నిర్వహించినా.. ప్రముఖ బౌద్ధ క్షేత్రమై న దంతపురిలో ఉన్న బుద్ధుడి విగ్రహం కనీసం పూలదండకు కూడా నోచుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
- బౌద్ధక్షేత్రం దంతపురిలో జాడలేని జయంత్యుత్సవాలు
- రియల్ ఎస్టేట్‌గా మారుతున్న భూములు
- ప్రభుత్వ, పర్యాటకశాఖ నిర్లక్ష్యంపై విమర్శలు
సరుబుజ్జిలి: ప్రపంచ దేశాల్లో గురువారం బుద్ధపౌర్ణమి సందర్భంగా బుద్ధుడి జయంతి వేడుక లు ఘనంగా నిర్వహించినా.. ప్రముఖ బౌద్ధ క్షేత్రమై న దంతపురిలో ఉన్న బుద్ధుడి విగ్రహం కనీసం పూలదండకు కూడా నోచుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బుద్ధుడి దంతం ఈ ప్రాంతంలో బయటపడిందని పురావస్తు పర్యాటక శాఖ ఆధ్వ ర్యంలో గతంలో టీడీపీ ప్రభుత్వం తవ్వకాలు జరప గా బౌద్ధస్తూపాలు, బుద్ధుడి కాలం నాటి కొన్ని పాత్రలు, విగ్రహాలు పరిసర ప్రాంత కోటగట్టు బయటపడిట్టు అప్పట్లో ప్రచారం ఊపందుకుంది. వెంటనే అప్పటి ప్రభుత్వం ఏటా బుద్ధపౌర్ణమి రోజు బుద్ధుడి జయంతి సందర్భంగా దంతపురిలో ఉత్స వాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపొందిం చారు. ఈ క్రమంలో బుద్ధుడి శిలా విగ్రహంతో పా టు కొన్ని నిర్మాణాలను కూడా చేపట్టారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి పర్యాటక శాఖకు అప్ప గించింది. 176 ఎ కరాల భూములు కలిగిన దంతపురి క్షేత్రంలో అప్పటి మంత్రి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధుడి జయంతి ఉత్సవా లకు దేశ, విదేశాల నుంచి బౌద్ధ సన్యాసులు ఈ ప్రాంతానికి వ చ్చారు. కాలక్రమేణా బుద్ధుడి ఉ త్సవాలు అటుంచితే దంతపురి పరిసర ప్రాంతాల్లోని 176 ఎకరా ల భూములు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మారి రియల్ ఎస్టేట్స్‌గా మారాయి. అయి తే అదే ప్రాంతంలో ఉన్న బుద్ధుడి విగ్రహం శిథిలా వస్థకు చేరుకొని పర్యాటకశాఖ నిర్లక్ష్యం మధ్య ఆ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాల నిలయంగా మా రింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నెలకు సుమారు రూ.30 నుంచి రూ.40 వేల జీతం అందిస్తూ బౌద్ధ క్షేత్రం కాప లాదారుడిగా ఒక వ్యక్తిని నియ మించినా.. అతడి జాడ కూ డా లేదు. జిల్లా ఉన్నతాధి కారులు, ప్రజా ప్రతిని ధులు మండల స్థాయి అధికారులు కూడా బు ద్ధుడి పుట్టిన రోజు బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు ఒక ప్పటిలా నిర్వహించలేకపో యినా.. దంతపురిలో ఉన్న బుద్ధుడి విగ్రహానికి కనీసం పూల దండ కూడా వేయకపోవ డం శోచనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ, రాష్ట్ర జిల్లా సోషల్ మాద్యమాల్లో శ్రీకాకుళం జిల్లా ఆమ దాలవలస సమీపంలో సరుబుజ్జిలి మండలం రొట్ట వలస వద్ద ప్రముఖ బౌద్ధ క్షేత్రం దంతపురి ఉన్న ట్టు సమాచారాన్ని ఉంచిన జిల్లా పర్యాటకశాఖ అధి కారులు దంతపురి భూముల పరిరక్షణకు ఎటువం టి చర్యలు చేపట్టనప్పటికీ కనీసం బుద్ధిడి జయంతి రోజైనా బుద్ధ విగ్రహానికి పూలదండ వేయకపోవడం దారుణమని పలువురు ఆవేదన చెందుతున్నారు.
Updated Date - May 24 , 2024 | 11:49 PM