రేపు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:41 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన దీపం పథకాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో ఆయన ప్రారంభించనున్నారు.
- ఉచిత గ్యాస్ పథకం ప్రారంభం
- ఈదుపురంలో సభ..
- రాత్రికి శ్రీకాకుళంలో బస
శ్రీకాకుళం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన దీపం పథకాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో ఆయన ప్రారంభించనున్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందించనున్నా రు. ఈదుపురంలో ఏర్పాటు చేసే సభలో లబ్ధిదా రులతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. అనంతరం కవిటి, కంచిలి మండలాల సమీప ప్రాంతాల్లో పర్యటించే అవకాశముంది. అదే రోజు రాత్రి శ్రీకాకుళం చేరుకుని.. డచ్ భవనం వద్ద విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమాలను సీఎం ప్రారంభి స్తారు. శనివారం ఉదయం శ్రీకాకుళంలో జరిగే కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొం టారు. మధ్యాహ్నం విజయనగరం జిల్లా బయ లుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం తలమునకలైంది.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.35 గంటలకు విజయవాడ నుంచి విమా నంలో బయలుదేరుతారు. 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో బయలుదేరి 12.40 గంటలకు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజాప్రతినిఽ దులతో మాట్లాడతారు. 1.05 గంటలకు ఈదు పురంలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి స్థితిగతు లను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. 1.50 గంటలకు ఈదుపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు భోజన విరామం. అక్కడ నుంచి హెలీక్యాఫ్టర్‌లో బయలుదేరి 3.45 గంటలకు శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. మరుసటి రోజు శనివారం ఉదయం 8.35 గంటలకు హెలీకాఫ్టర్‌లో బయలుదేరి విజయనగరం జిల్లా వెళ్తారు.
Updated Date - Oct 31 , 2024 | 12:41 AM