ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధర్మానపై కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదు

ABN, Publish Date - Apr 22 , 2024 | 12:05 AM

రెవెన్యూ మంత్రి, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి.. ధర్మాన ప్రసాదరావుపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 21: రెవెన్యూ మంత్రి, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి.. ధర్మాన ప్రసాదరావుపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ జి.వాసు తెలిపిన వివరాలివీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సాయంత్రం కళ్లేపల్లిలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. అక్కడ గ్రామ సచివాలయం వద్ద విద్యుత్‌ దీపాలు అమర్చి.. ప్రచారం నిర్వహించారు. కొంతమంది స్థానికులకు వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఎంసీసీ బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు నమోదు చేశామని రూరల్‌ ఎస్‌ఐ వాసు తెలిపారు.

- అలాగే శుక్రవారం రాత్రి స్థానిక సన్‌రైజ్‌ హోటల్‌లో విశ్రాంత ఉద్యోగులకు ఆత్మీయ కలయిక పేరుతో ధర్మాన ప్రసాదరావు సమావేశం ఏర్పాటు చేసి.. విందు ఇచ్చారు. దీనిపై కూడా ఎంసీసీ బృందం ఫిర్యాదు చేయడంతో ధర్మానపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 22 , 2024 | 12:06 AM

Advertising
Advertising