ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌ఫీల్డ్‌, పల్సర్‌ వాహనాలే లక్ష్యంగా చోరీ

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:42 PM

అత్యంత ఖరీదైన ఎన్‌ఫీల్డ్‌, పల్సర్‌ వాహ నాలే లక్ష్యంగా ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి వాహనాలు చోరీ చేస్తూ కాశీబుగ్గ పోలీసు లకు పట్టుబడ్డాడు.

పట్టుబడిన నిందితుడితో కాశీబుగ్గ డీఎస్పీ, సీఐ, క్రైమ్‌ పోలీసులు 

పలాస, నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): అత్యంత ఖరీదైన ఎన్‌ఫీల్డ్‌, పల్సర్‌ వాహ నాలే లక్ష్యంగా ఒడి శాకు చెందిన ఓ వ్యక్తి వాహనాలు చోరీ చేస్తూ కాశీబుగ్గ పోలీసు లకు పట్టుబడ్డాడు. ఆయన వద్ద నుంచి 15 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసు కున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్టేషన్‌ ఆవరణ లో నిందితుడిని విలేకరుల ఎదుట ప్రవేశ పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రం రాయఘడ బ్లాక్‌ మండల సాహి గ్రామానికి చెందిన అమీర్‌బుయాన్‌ బైక్‌ చోరీ చేసి ఇచ్ఛాపురం నుంచి వస్తు న్నాడని, మొగిలిపాడు హైవే వద్ద వాహనాల తనిఖీ సమయంలో ఆయన కదలి కల్లో తేడా రావడంతో పట్టుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడిం దన్నారు. బైక్‌లను చోరీ చేసి విక్రయిస్తున్న వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనాలు బయటపడ్డాయన్నారు. పలాసలో 8, మందస లో రెండు, టెక్కలిలో ఒకటి, సోంపేటలో 4 బైక్‌లు చోరీ చేసి విక్రయానికి పెట్టడంతో వాటిని ప్రత్యేక పోలీ సులు స్వాధీనం చేసుకున్నారన్నారు. 2023 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు బుయాన్‌ ముఠా మొత్తం 15 వాహనాలు చోరీ చేశారన్నారు. నిందితుడికి ద్విచక్రవానాలు రిపేరు చేసే షాపు ఉందని, ఆయనకు వచ్చే ఆదాయం సరిపడక దొంగగా మారాడన్నారు. ఈ క్రమంలో ఆయనకు సిగిలిపొదరో గ్రామానికి చెందిన అంజు, చెలిగడకి చెందిన ఆలీఫ్‌, అంతరాడకి చెందిన సిద్ధాంత్‌, రామగిరికి చెందిన బిల్లా, సునీల్‌ నాయక్‌, బులడగామకి చెందిన లాడెన్‌, పలాస మండలం పెదంచలకి చెందిన తమిరి రఘునాథ్‌తో పరిచయం ఏర్పడిందని, విడివిడిగా దొంగ తనాలు చేశావారన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఒక్కడే సోంపేట, మందస, పలాస, టెక్కలి ప్రాంతాల్లో 15 వాహనాలు చోరీ చేసి తన గ్యారేజిలో భద్రపరి చాడని, ఆదివారం పలాస రైల్వే స్టేషన్‌లో పల్సర్‌ని దొంగతనం చేసి విశాఖ పట్నంలో ఆ వాహనాన్ని అమ్మడానికి వెళ్లి వస్తుండగా పోలీసులు అరెస్టు చేశార న్నారు. చిన్నబడాం వద్ద వినాయకచవితి మండపంలో రెండు వాహనాలు చోరీకి పాల్పడిన రఘునాథ్‌ వాహనాలతో పట్టుబడి పర్లాకిమిడి జైలులో ఉన్నాడని వివరిం చారు. వాహనాలు, నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్‌ పోలీసులు గవర య్య, ప్రసాద్‌, నీలకంఠం, షణ్ముఖరావులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ డి.మోహనరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:42 PM