scorecardresearch
Share News

ప్రతీ ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:09 AM

ఉద్దానం ప్రాంత ప్రజలంతా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించు కోవా లని, అప్పుడే కిడ్నీ వ్యాధిబా రిన పడకుండా జాగ్రత్తలు తీసు కోవచ్చునని జిల్లా న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జేఏ మౌలానా అన్నారు.

ప్రతీ ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి

కంచిలి: ఉద్దానం ప్రాంత ప్రజలంతా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించు కోవా లని, అప్పుడే కిడ్నీ వ్యాధిబా రిన పడకుండా జాగ్రత్తలు తీసు కోవచ్చునని జిల్లా న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జేఏ మౌలానా అన్నారు. శనివారం కంచిలి పీహెచ్‌సీ కేంద్రం వద్ద ఉచిత వైద్య శిబిరా న్ని నిర్వహించి, కిడ్నీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిపై సదస్సులు నిర్వహించి అవగా హన కల్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఆర్‌.సన్యాసినాయుడు, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, వైద్యులు భానుప్రకాష్‌, హరిబాబు, తహసీల్దార్‌ ఎంవీకేఎస్‌ రవి, ఎంపీడీవో వి.నీరజ, సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- సోంపేట: పట్టణంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సామాజిక ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఉచి తంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సివిల్‌ న్యాయాధికారి ఆర్‌.సన్యా సినాయుడు, ఎంపీడీవో వి.నీరజ, ఈవోపీఆర్డీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Mar 24 , 2024 | 12:09 AM