కందివలస గెడ్డ పరిశీలన
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:05 AM
పైడిభీమవరం పారిశ్రామిక వాడలోని కందివలస గెడ్డను కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. పారిశ్రామికవాడలోని పరిశ్రమల వ్యర్థాలు కందివలస గెడ్డలో కలుస్తుండడంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన ‘ఉపాధి లేదు.. కాలుష్యమే’ అన్న కథనానికి అధికారులు స్పందించారు.
- శాంపిళ్ల సేకరణ.. ల్యాబ్‌కు తరలింపు
- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
రణస్థలం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పైడిభీమవరం పారిశ్రామిక వాడలోని కందివలస గెడ్డను కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. పారిశ్రామికవాడలోని పరిశ్రమల వ్యర్థాలు కందివలస గెడ్డలో కలుస్తుండడంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన ‘ఉపాధి లేదు.. కాలుష్యమే’ అన్న కథనానికి అధికారులు స్పందించారు. కందివలస గెడ్డ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితంతో ఒక వైపు, పారిశ్రామిక వాడ వాయు కాలుష్యంతో మరోవైపు పరిసర గ్రామాల ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా దొరకడం లేదు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ కథనం చర్చనీయాంశమైంది. దీనిపై కాలుష్య నియంత్రణ శాఖ ఈఈ బి.కరుణశ్రీ స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు ఏఈ సీహెచ్ హరీష్ కందివలస గెడ్డలో జలాలను శనివారం పరిశీలించారు. నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌నకు తరలించారు. గెడ్డలో పరిశ్రమల వ్యర్థాలు విడిచిపెట్టినట్లు తేలితే నోటీసులిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వారి వెంట పారిశ్రామికవాడలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు ఉన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 12:05 AM