రెచ్చిపోయిన రౌడీషీటర్లు
ABN, Publish Date - May 15 , 2024 | 12:24 AM
నగరంలో రౌడీషీటర్‌తో పాటు మరో ముగ్గురు కలసి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని గొంటి వీధికి చెందిన ఢిల్లీశ్వరరావు అలియాస్ బాక్సర్ ఈశ్వర్, అతని సోదరుడు వెంకటరమణలు పోలింగ్ జరిగిన 13వ తేదీ రాత్రి 11.15 గంటలకు రామలక్ష్మణ కూడలి సమీపంలో ఉన్న కేఎఫ్‌సీకి వెళ్లారు.
శ్రీకాకుళం క్రైం, మే 14: నగరంలో రౌడీషీటర్‌తో పాటు మరో ముగ్గురు కలసి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని గొంటి వీధికి చెందిన ఢిల్లీశ్వరరావు అలియాస్ బాక్సర్ ఈశ్వర్, అతని సోదరుడు వెంకటరమణలు పోలింగ్ జరిగిన 13వ తేదీ రాత్రి 11.15 గంటలకు రామలక్ష్మణ కూడలి సమీపంలో ఉన్న కేఎఫ్‌సీకి వెళ్లారు. ఆ సమయానికి అది మూసివేసి... సిబ్బంది షాపులో శుభ్రం చేస్తున్నారు. ఢిల్లీశ్వరరావు, అతని సోదరుడు రమణలు తమకు ఆహారం కావాలని ఆర్డర్ చేశారు. మూసివేసినట్టు అక్కడి మేనేజర్ అదపాక రవి తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన వారిద్దరూ బెదిరింపులకు దిగారు. తామేమీ చెయ్యలేమని... అంతా ఆన్‌లైన్ వ్యాపార మని రవి వారికి వివరించాడు. దీంతో ఢిల్లీశ్వరరావు, అతని సోదరుడు దాడికి తెగ బడ్డారు. అంతటితో ఆగకుండా రౌడీషీటర్ కొర్లకోట శేఖర్‌ను, హర్ష, రాజేంద్రలను అక్కడికి పిలిపించి షాపులోని రూ.3.4 లక్షల విలువైన సామాన్లు ధ్వంసం చేశారు. ఆర్డర్ ఇవ్వలేదన్న కోపంతో అదపాక రవితో పాటు ఆశిష్ చౌదరిలపై ఢిల్లీశ్వరరావు అతని సోదరుడితో పాటు రౌడీషీటర్ శేఖర్‌లు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరికి ముక్కు పగిలిపోగా, మరొకరికి కంటిపై నాలుగు కుట్లు పడ్డాయి. దాడి చేసిన వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులను కేఎఎఫ్‌సీ సిబ్బంది చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. అవుట్ పోస్టు పోలీసుల సమాచారం మేరకు రెండో పట్టన సీఐ జి. ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు.
Updated Date - May 15 , 2024 | 12:24 AM