ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రోన్లతో సాగు..

ABN, Publish Date - Dec 08 , 2024 | 12:22 AM

పెట్టుబడులు తగ్గించి.. వ్యవసాయం లాభసాటిగా మార్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందజేయాలని నిర్ణయించాయి. నూతన సాగు విధానాలను ప్రోత్సహిస్తున్నాయి.

డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారీ

- జిల్లాకు 127 అవసరమని అధికారుల ప్రతిపాదనలు

- నమో డ్రోన్‌ దీదీ పథకం కింద సబ్సిడీపై పంపిణీకి చర్యలు

టెక్కలి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): పెట్టుబడులు తగ్గించి.. వ్యవసాయం లాభసాటిగా మార్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందజేయాలని నిర్ణయించాయి. నూతన సాగు విధానాలను ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా పంటలను వివిధ రకాల తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు, కొన్నిరకాల నానో ఎరువులు పొలాలకు అందించేందుకు, పొలంలో ఎద విత్తనాలు వేసేందుకు అవసరమయ్యే డ్రోన్‌ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చాయి. నమో డ్రోన్‌ దీదీ పథకం కింద సబ్సిడీపై డ్రోన్లు అందజేయనున్నాయి. ఈ మేరకు జిల్లాలో 1,54,930 హెక్టార్లకు సంబంధించి 127 డ్రోన్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వ్యవసాయం సులభతరంతోపాటు కూలీల భారం తగ్గించేందుకు ఈ డ్రోన్ల వ్యవస్థ పనిచేస్తుంది. ఐదు ఎకరాల యూనిట్‌ పంట సాగుకు కేవలం 20నిమిషాల్లో పురుగు మందులు, నానో ఎరువులు పిచికారీ చేయడంతో పాటు విత్తనాలు కూడా డ్రోన్లు జల్లుతాయి. కొన్ని సందర్భాల్లో రైతులకు సకాలంలో ఎరువులు దొరక్కపోవడం, రవాణా తదితర సమస్యలు వచ్చినప్పుడు కూడా నానో ఎరువులు డ్రోన్లతో పిచికారీ చేయొచ్చు.

- వెయ్యి నుంచి 1,200 హెక్టార్లు ఒక క్లస్టర్‌గా గుర్తించి అందుకు అవసరమయ్యే రీతిలో డ్రోన్‌ సహకారం అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సోంపేట సబ్‌డివిజన్‌ పరిధిలో 11,306 హెక్టార్లకు పది డ్రోన్లు, పలాస సబ్‌డివిజన్‌ పరిధిలో 18,856 హెక్టార్లకు 15 డ్రోన్లు, టెక్కలి సబ్‌డివిజన్‌ పరిధిలో 34,004 హెక్టార్లకు 28 డ్రోన్లు అవసరమని గుర్తించారు. నరసన్నపేట సబ్‌డివిజన్‌లో 28,532 హెక్టార్లకు 24 డ్రోన్లు, శ్రీకాకుళం సబ్‌డివిజన్‌లో 19,862హెక్టార్లకు 16డ్రోన్లు, రణస్థలం సబ్‌డివిజన్‌లో 20,032 హెక్టార్లకు 16డ్రోన్లు, కొత్తూరు సబ్‌డివిజన్‌లో 22,3338 హెక్టార్లకు 18 డ్రోన్లు అవసరమని ప్రతిపాదనలు చేశారు. ఈ డ్రోన్‌ రూ.6లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉండగా, దీన్ని 50శాతం సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాగా.. రైతులు 80 శాతం సబ్సిడీతో డ్రోన్లు సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి కోరాడ త్రినాథస్వామి వద్ద ప్రస్తావించగా సెర్ప్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే నమో డ్రోన్‌ దీదీ పథకం కింద ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి అవసరమయ్యే పైలెట్ల శిక్షణకు 15 రోజులకుగాను రూ.75వేలు ఖర్చవుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రాథమికంగా నలుగురు శిక్షణ పొందారని తెలిపారు.

Updated Date - Dec 08 , 2024 | 12:22 AM