ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘోర ప్రమాదం

ABN, Publish Date - Jun 19 , 2024 | 11:20 PM

జాతీయ రహదారిపై విక్రంపురం సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పక్కన ఆగివున్న ఓ లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొంది.

లారీలో క్యాబిన్‌లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్‌ సిబ్బంది.

-ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ

- డ్రైవర్‌, క్లీనర్‌ దుర్మరణం

టెక్కలి, జూన్‌ 19: జాతీయ రహదారిపై విక్రంపురం సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పక్కన ఆగివున్న ఓ లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో టెక్కలి మండలం విక్రంపురం సమీపంలో ఓ లారీని ఆపి డ్రైవర్‌, క్లీనర్‌ బహిర్భూమికి వెళ్లారు. అదే సమయంలో పలాస నుంచి కాకినాడ వైపు వెళ్తున్న మరో లారీ ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వస్తున్న ఇంకొక వావానాన్ని తప్పించబోయి ఆగిఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న అస్సాం రాష్ట్రానికి చెందిన డ్రైవర్‌ హాసద్‌ ఆలీ (42), క్లీనర్‌ నూరల్‌ ఇస్రామ్‌(35) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌, క్లీనర్‌ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. ఎస్‌ఐ లక్ష్మి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 19 , 2024 | 11:20 PM

Advertising
Advertising