ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుణాల పండగ

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:51 PM

గత వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. ఐదేళ్ల పాలనలో వాటి ద్వారా ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. అయితే, కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేషన్లకు జవసత్వాలు వచ్చాయి.

- త్వరలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందజేత

- మహిళలకే అధిక ప్రాధాన్యం

- జిల్లాకు రూ.133 కోట్లు కేటాయింపు

- 8,971 మందికి చేకూరనున్న లబ్ధి

శ్రీకాకుళం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. ఐదేళ్ల పాలనలో వాటి ద్వారా ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. అయితే, కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేషన్లకు జవసత్వాలు వచ్చాయి. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాలు మంజూరు చేసేందుకు సంకల్పించింది. అతిత్వరలో ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇప్పటికే జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంతమందిని ఎంపిక చేయాలి, టార్గెట్‌, వెచ్చించనున్న నిధుల వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పల్స్‌స్‌ సర్వే ప్రాతిపదికగానే ఇప్పుడు రుణాలు మంజూరు చేయన్నారు.

జిల్లాకు రూ.133 కోట్లు

జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా 8,971 మందికి లబ్ధిచేకూరే విధంగా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆరు రంగాల్లో శిక్షణ ఇచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రూ.133.59 కోట్ల రుణాలను అందించనుంది. ఈ ప్రక్రియ మరో నాలుగు నెలల్లో పూర్తికానుంది. లబ్ధిదారునికి బ్యాంకు రుణం మంజూరు చేయడమే కాకుండా, జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ నుంచి ప్రోత్సాహం, ఆపై లబ్ధిదారుని వాటాతో కలిపి రుణంగా అందజేస్తారు. ఇప్పటికే జిల్లా నుంచి ప్రభుత్వానికి నివేదిక చేరింది.

వివిధ అంశాలపై శిక్షణ..

బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలను పొందేందుకు కొన్ని రంగాలను ఎంపిక చేసి, వాటిలో లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ అనంతరం రాయితీపై స్వయం ఉపాధి కోసం రుణాలు అందించనుంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లలో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. యువతకు ఇండస్ట్రీస్‌ సర్వీస్‌ బిజినెస్‌, చేతివృత్తులకు సహకారం, వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి వంటి సేవల విభాగంలో రుణాలను ఇవ్వనుంది. అలాగే చిన్నతరహా కుటీర పరిశ్రమలు, బిజినెస్‌ యూనిట్లు, మినీ డెయిరీ యూనిట్లు, గొర్రెలు, మేకల పెంపకం, వెదురుబుట్టల తయారీ, కుమ్మరి, వడ్రంగి తదితర చేతివృత్తులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తారు. హౌస్‌ కీపింగ్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ సర్వీస్‌, చెఫ్‌, సెక్యూరిటీ గార్డులు.. ఇలా ఈ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలనూ కల్పిస్తా రు. అలాగే జనరిక్‌ మందుల దుకాణాలను కూడా విరివిగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకుగాను బీ-పార్మసీ చదవిన బీసీ యువతకు శిక్షణ ఇచ్చి, జనరిక్‌ దుకాణం ఏర్పాటు చేయనుంది. అందుకు సంబంధించి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మండలాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు చేసుకునే విధానం అతిత్వరలో విడుదలకానుంది.

Updated Date - Dec 02 , 2024 | 11:51 PM